Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రులకు వీడ్కోలు - విందులు : రాజీనామా లేఖలతో నేడు - ఉద్వేగ క్షణాలు..!!

ఏపీ మంత్రులకు నేడే అధికారిక హోదా చివరి రోజు. మంత్రులుగా ఈ రోజు లాస్ట్ డే కావటంతో ఉద్వేగ భరిత వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశం మంత్రులుగా తమ చివరిదని చాలా మంది మంత్రులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఎవరు కొనసాగుతారనే అంశం పైన చర్చ సాగుతున్నా..నలుగురు అయిదుగురు మినహా.. మంత్రి పదవులు పోయినట్లే అనే నిర్ణయానికి వచ్చేసారు. దీంతో.. పాటుగా మంత్రులంతా రాజీనామా చేయాల్సిందే..అనే విధానపరమైన నిర్ణయంతో రాజీనామా లేఖలతోనే మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగుస్తూనే వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ..సీఎంకు లేఖలు ఇవ్వనున్నారు.

మూడేళ్లుగా తిరుగులేని అధికారాలతో..

మూడేళ్లుగా తిరుగులేని అధికారాలతో..

అయితే, మూడేళ్లుగా మంత్రులుగా కొనసాగుతూ..అటు సీఎంతో..ఇటు అధికారులతో.. తమ సిబ్బందితో కొనసాగిన వారు ఇక మాజీలు కాబోతున్నారు. దాదాపు మంత్రులంతా దీని కోసం మానసికంగా సిద్దమయ్యారు. 2019 కేబినెట్ ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ రెండున్నారేళ్ల తరువాత మంత్రులు మారుతారని స్పష్టం చేసారు. కొంత కాలంగా మార్పుల పైన సంకేతాలు ఇస్తున్నారు. ఇక, ఆ రోజు రానే వచ్చింది. పలువురు మంత్రులు విజయవాడలోని తమ క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేసేందుకు సిద్దమయ్యారు. మంత్రుల వద్ద పని చేస్తున్న సిబ్బంది.. కొత్తగా వచ్చే మంత్రుల వద్ద చేరేందుకు ప్రస్తుత మంత్రులతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మంత్రులకు తమ శాఖల పరిధిలోని అధికారులు విందులు ఏర్పాటు చేస్తున్నారు.

వారి అంచనాలు సైతం తారు మారు

వారి అంచనాలు సైతం తారు మారు

తాజాగా.. రవాణా శాఖ అధికారులు మంత్రి పేర్ని నానికి విందు ఇచ్చారు. ఇక, ఈ రోజు మీడియా ప్రతినిధుల కోసం మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు ఏర్పాటు చేసారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అవుతున్నా..దాదాపు ఏడాదిన్నారకు పైగా కరోనా కారణంగా విధులు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయామని మంత్రులు చెబుతున్నారు. ఇక, మరి కొందరు సీనియర్ మంత్రులు కేబినెట్ విషయం లో సీఎం నిర్ణయం తమకు శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాల పైన విరుచుకుపడటంలో..మంత్రులుగా ప్రభుత్వం - పార్టీ వాయిస్ బలంగా వినిపించే మంత్రులుగా పేరున్న బొత్సా .. పెద్దిరెడ్డి.. బుగ్గన .. కన్నబాబు.. పేర్ని నాని..కొడాలి నాని..అనిల్..బాలినేని వంటి వారికి కొనసాగింపు ఉంటుందనే అంచనాలు నిన్న మొన్నటి వరకు వినిపించాయి. కానీ, వీరిలో ఎవరికీ తిరిగి కొనసాగే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Recommended Video

    AP Cabinet Expansion: కొత్త మంత్రులతో కేబినెట్ కూర్పు AP CM Jagan క్లారిటీ | Oneindia Telugu
    సీఎం తుది నిర్ణయం పైన ఉత్కంఠ

    సీఎం తుది నిర్ణయం పైన ఉత్కంఠ


    పూర్తిగా సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా చేస్తున్న ప్రక్షాళన కావటంతో..వీరు పార్టీ బాధ్యతలు తీసుకోనున్నారు. వీరికి పార్టీ పరంగా రీజనల్ ఇన్ ఛార్జ్ లు.. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా వారిని ఎందుకు తప్పించాల్సి వస్తోంది..కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి..తప్పిస్తున్న వారికి భవిష్యత్ లో కల్పించే అవకాశాల పైన హామీలు ఇస్తున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో తన మనసులోని మాటలను సీఎం బయట పెట్టే ఛాన్స్ ఉంది. దీంతో..ఈ జరిగే కేబినెట్ సమావేశం ఒక విధంగా ఉద్వేగ సమయంగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కేబినెట్ ముగిసిన తరువాత ఇక, మాజీలు కాబోతున్న ఈ మంత్రులు తమ వ్యక్తిగత వాహనాలలోనే రిటర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+