అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ - ప్రతీ ఇంటికి వెళ్లి రైతుల ఆహ్వానం..!!
ముఖ్యమంత్రి అమరావతి పర్యటపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమరావతి పరిధిలో పేదలకు ఇంటి స్థలాలను సీఎం జగన్ పంపిణీ చేయన్నారు. టిడ్కో ఇళ్లనూ అందించనున్నారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత తొలి సారి సీఆర్డీఏ పరిధిలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రతీ ఇంటికి వెళ్లి స్థానిక రైతులు..మహిళలు వెళ్లి గ్రామస్థులు దీక్షా శిబిరాలకు తరలి రావాలని..నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
అమరావతికి సీఎం జగన్: ముఖ్యమంత్రి జగన్ అమరావతి లో ఈ రోజు పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. తుళ్లూరు మండలం ,వెంకటపాలంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లే ఔట్లు ఏర్పాటు చేసారు. ఇళ్ల పట్టాల పంపిణీో పాటుగా సీఆర్డీఏ ప్రాంతంలో రూ 443,.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను అందించే కార్యక్రమానికి సీఎం ప్రారంభిస్తారు.

నిరసనలకు పిలుపు: ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో స్థానిక రైతులు నిరసనలకు పిలుపునిచ్చారు. బయటి ప్రాంతం వారికి భూమి పంపిణీ కార్యక్రమం తలపెట్టటంతో నిరసనలకు సిద్దం అవుతున్నారు. రాజధాని 29 గ్రామాల్లో ఉన్న రైతుల శిబిరాల్లో నల్ల రిబ్బెన్లు..నల్ల కండువాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. తప్పనిసిరిగా ఇంటికొకరు చొప్పున శిబిరానికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతీ ఇంటికి వెళ్లి మహిళలు..రైతులు ఆహ్వానం పలికారు. అమరావతిలో ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు వైఎస్సార్, సీఎం జగన్ కటౌట్లకు పాలాభిషేకం చేసారు.

సీఎం ప్రసంగం పై ఆసక్తి : ఇంటి స్థలాల పంపిణీ వేళ జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. అమరావతిలో ఒక గొప్ప కార్యక్రమం, పండగలా జరగబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి అమరావతి రైతులతో సహా అందరినీ ఆహ్వానిస్తున్నామని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. అమరావతిలో కొందరు పెత్తందారీ మహిళలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వాళ్లకు అండగా నిలబడి పోరాటాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అమరావతి రైతులు చంద్రబాబు నయవంచనను అర్ధం చేసుకోవాలని సూచించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగన్ చేసే ప్రసంగం.. ఏం చెప్పబోతున్నారనే అంశం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications