నేడే అరుదైన ఘట్టం, తొలి సారిగా - భక్తులకు గోల్డెన్ ఛాన్స్..!!

సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు (శుక్రవారం)జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలు, దేశ, విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ సారి కల్యాణోత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

నేడే కల్యాణోత్సవం
ఈ సాయంత్రం ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. టీటీడీ, జిల్లా అధికారుల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంటిమిట్టలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. సీతారాము ల క‌ల్యాణం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారని వెల్లంచారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల‌ మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ⁠ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

all-set-for-sri-sita-rama-kalyanam-in-a-grand-manner-at-vontimitta

భక్తులకు తలంబ్రాలు
⁠కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయించారు. ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ⁠టిటిడి విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందిని నియమించగా..130 సిసి కెమెరాలు, 07 డ్రోన్ లు ఏర్పాటు చేసారు. కామన్ కమెండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్ షించేలా చర్యలు తీసుకున్నారు.

శ్రీవారి సేవకులతో
⁠కళ్యాణానికి విచ్చేసి భక్తులు వాహనాల పార్కింగ్ కొరకు సాలాబాద్ వద్ద 2, సాయి నగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామని ఛైర్మన్ నాయుడు వెల్లడించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో, క‌ల్యాణ వేదిక వ‌ద్ద అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుగుతుందని చెప్పారు. ⁠ఆర్‌టిసి ద్వారా క‌డ‌ప నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 85 బ‌స్సుల‌తో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 40 బ‌స్సుల‌తో 220 ట్రిప్పులు అన‌గా మొత్తం 645 ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించారు. వేదిక ప్రాంగణాన్ని 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేపట్టార. శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల వీక్షించేందుకు వీలుగా హెచ్‌డి క్యాలిటీతో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+