allu arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఏషియన్ సత్యం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులంతా వ్యాపారాలపై కూడా దృష్టిసారించారు. సినిమాలతోపాటు వ్యాపార రంగంలోను రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయం సాధిస్తున్నారు. మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ మాల్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో పార్ట్నర్ షిప్ తో మల్టీప్లెక్స్ వ్యాపారం చేస్తున్నారు. తన సొంత ఊరిలో సొంతంగా థియేటర్ కట్టుకోవాలనేది తన కోరిక అని, దీంతో తన కోరికను నెరవేర్చుకోగలిగానని విజయ్ వెల్లడించారు.
తాజాగా 'పుష్ప' ఘనవిజయంతో మంచి స్వింగ్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టారు. ఏషియన్ అల్లు అర్జున్ పేరుతో హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణం పూర్తిచేసుకొని త్వరలోనే ఓపెనింగ్ అవడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అల్లు అర్జున్ దీన్ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 'ఏషియన్ సత్యం మాల్' అండ్ మల్టీప్లెక్స్.. త్వరలోనే గొప్ప ప్రారంభం కాబోతోంది అని రాసివుంది.

దీనికి సంబంధించిన వార్తలను అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. తమ కథానాయకుడు కూడా మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతారని చెబుతున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్ ను అల్లు అర్జున్ కొనుగోలు చేశారు. ఏషియన్ గ్రూప్ తో కలిసి భాగస్వామిగా దీన్ని నిర్మిస్తున్నారు. సత్యం థియేటర్ అంటే చాలా ఫేమస్. ఆ పేరును పోగొట్టకుండా అదే పేరుతో మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ నిర్మించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications