వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నికణం అల్లూరి -దేశానికి స్ఫూర్తి ప్రధాత : భీమవరం సభలో సీఎం జగన్..!!

|
Google Oneindia TeluguNews

పోరాట యోధులలో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి జగన్ నివాళి అర్పించారు. భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతోత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని మోదీ 30 అడుగులు అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి స్పూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి కొనియాడారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి మనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారన్నారు.

పోరాట యోధులలో మహా అగ్నికణం అల్లూరి అంటూ సీఎం కొనియాడారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని సీఎం వివరించారు. భావాల పరంగా మరణం లేని ఓ విప్లవవీరుడని కీర్తించారు.తెలుగుజాతికి, దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రధాతగా పేర్కొన్నారు. అల్లూరి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన గడ్డకు మనందరి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టిందని ముఖ్యమంత్రి వివరించారు.

Alluri weapon for freedom, he is an inspiration for the country-CM Jagan

అంతకు ముందు ప్రధానికి గన్నవరంలో గవర్నర్ బిశ్వభూషణ్.. సీఎం జగన్ స్వాగతం పలికారు. భీమవరం సభా వేదిక పైన ప్రత్యేకంగా ప్రధానిని సీఎం సత్కరించారు. భీమవరం సభ ముగిసిన తరువాత గన్నవరంలో ప్రధానికి వీడ్కోలు పలికారు. అయితే, ప్రధాని పర్యటన సమయంలో పలువరు ప్రముఖులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానాలు పంపారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇతర ప్రముఖులు కూర్చొనేందుకు మరో వేదిక ఏర్పాటు చేసారు.

English summary
CM Jagan paid tirubutes to Alluri Sita Rama ju on his 125th birth day, partiicpated in public meeting along with PM in bhimavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X