అమరావతిలో పాదయాత్ర - బహిరంగ సభ, ప్రభుత్వ తాజా నిర్ణయంతో..!!
అమరావతి ప్రాంతంలో మరోసారి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరావతి పరిధిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో ప్రభుత్వం విధ్వసంనానికి కుట్ర చేస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఈ నెల 24న ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అటు జిల్లా అధికారులు ఆర్ -5 జోన్ లో 1134.58 ఎకరాలను నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రెండు జిల్లాల వారికి కేటాయించారు.
నిరసన షెడ్యూల్ ప్రకటన: అమరావతి పరిధిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ను రైతు జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాలైన మంగళగిరి మండలం క్రిష్ణాయపాలెంతో మొదలై మందడం, ఐనవోలు, కురగట్లు మీదుగా నిడమర్రు వరకు నిరసనగా ప్రజా చైతన్య పాదయాత్రకు నిర్ణయించింది. 24వ తేదీన ఈ యాత్ర నిర్వహణకు నిర్ణయించారు.

సాయంత్రం నిడమర్రుతలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో విన్నపాలను ఇవ్వటంతో పాటుగా నిరసన కార్యక్రమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. మే 2న ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టరేట్లతో విన్నపాలనిస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించ క పోతే ఉద్యమం తీవ్రం చేయాలని కమిటీ నిర్ణయించింది.
ప్రభుత్వ కుట్ర చేస్తోందంటూ: అమరావతి రైతు జేఏసీ నేతలు వెలగపూడిలో సమావేశమయ్యారు. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయస్థానంలో విచారణలో ఉండగానే ఆర్ -5 జోన్ ఏర్పాటు పెద్ద కుట్రగా జేఏసీ నేతలు ఆరోపించారు. సెంటుభూమి పేరుతో ప్రభు్వం అమరావతి విధ్వంసానికి తెర తీసిందని ధ్వజమెత్తారు.
ఆర్ -3 జోన్ లో రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వగా అయిదు వేల ఎకరాలు మిగులు భూమి ఉందని, అక్కడ కాకుండా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూమిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించటం ఏంటని ప్రశ్నించారు. ఆర్ -3 జోన్ నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వలనేదని నిలదీసారు. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో పరువు దక్కించుకొనే రాజకీయ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.
సిద్దమైన ఇళ్ల పట్టాలు: రాజధాని ప్రాంతంలో స్థానికేతరులక ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియను గుంటూరు జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. లబ్దిదారుల ఎంపిక, పరిశఈలన, పట్టాల ముద్రణ చేస్తోంది. ఆర్ -5 జోన్లో నవరత్నాలు, పేదలకు ఇళ్లు కార్యక్రమం కింద మొత్తం 1134.58 ఎకాలను గుంటూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లోని వారికి కేటాయించారు. లబ్దిదారులకు ఒక్కొక్కరికి సెంటు భూమి కేటాయించనున్నారు.
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటుగా పెదకాకాని, తుళ్లూరు మండలాల పరిధిలో 19,854 మంది లబ్దిదారులను గుర్తించారు. వీటికి పట్టాలు నమోదు చేసి ప్రింట్ ఇస్తున్నారు. అటు ఆర్ -5 జోన్ పరిధిలో స్థానికేతురలకు స్థలాలు ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో, రేపు (సోమవారం) చోటు చేసుకొనే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications