జగన్‌కు పండ్లు, మిఠాయిలు తీసుకువెళ్లిన అమరావతి రైతులు

అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు పూలబొకేలు, పండ్లు, మిఠాయిలు తీసుకొని తాడేపల్లిలో నివాసం ఉండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలంటూ అక్కడ రక్షణగా ఉన్న పోలీసులను కోరగా వారు నిరాకరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల సమయంలో తమను కలవడానికి ఆయన ప్రయత్నించలేదని, తామే ఆయన్ను కలవాలని ఎన్నోసార్లు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే నిరాకరించారని రైతులు వెల్లడించారు.

ఎందుకు అడ్డుకుంటున్నారు?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాలమీదుగానే సచివాలయానికి వెళుతూ పరదాలు కట్టుకున్నారని, కలుద్దామంటే పోలీసులు నెట్టేశారని రైతులు వాపోయారు. ఇప్పుడైన ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వలంటూ పోలీసులకు విన్నవించుకున్నారు. మీరు హేళన చేయడానికి వచ్చారా? అంటూ పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను కలిసేందుకు అవకాశమే లేదని తేల్చిచెప్పారు. దానికి రైతులు బదులిస్తూ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుకదా.. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు.. ఎమ్మెల్యే అని, ఆయన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.

Amaravati farmers brought fruits and sweets to ex cm ys Jagan

రెండురోజులున్న తర్వాత..
ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సీఐ సూచించారు. అలా సూచిస్తూనే మహిళా పోలీసులతో రైతులను నెట్టించేందుకు ప్రయత్నించారు. ఎంత అడిగినా జగన్ ను కలవడానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో అన్నదాతలు తాము తీసుకువచ్చిన పండ్లు, మిఠాయిలు అక్కడున్నవారందరికీ పంచిపెట్టారు.

రెండురోజులు గడిచిన తర్వాత జగన్ ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని పోలీసులు చెప్పడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందని ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి మూడు రాజధానులన్నారు. దీనిపై నాలుగున్నర సంవత్సరాల సమయం రైతులు దీక్షలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+