నేడు అమరావతి బంద్: మూడు రాజధానుల ప్రకటనతో భగ్గుమన్న రైతుల నిరాహార దీక్షలు

ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా చేసిన ప్రకటనతో ఏపీలో రాజకీయ దుమారం నెలకొంది. సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ పై అటు టిడిపి, ఇటు జనసేన పార్టీలో తీవ్రంగా మండిపడుతున్నాయి.అంతేకాదు రాజధాని రైతుల నుండి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆందోళన బాట పట్టిన రైతులు మూడు రాజధానులు ప్రకటనను సీఎం జగన్ మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపునిచ్చారు.

సీఎం జగన్ ప్రకటనపై రాజధాని రైతుల ఆగ్రహం

సీఎం జగన్ ప్రకటనపై రాజధాని రైతుల ఆగ్రహం

35 వేల ఎకరాల భూములు రాజధాని కోసం ఇచ్చామని, ఆ భూముల పరిస్థితి ఏంటి అని, తమ పిల్లల భవిష్యత్ ఏంటి అని రాజధాని రైతులు వైసిపి సర్కార్ ను నిలదీస్తున్నారు. మూడు ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికా తో పోలుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీని వెనుకబాటుతనానికి గురి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన బాటపట్టిన రాజధాని ప్రాంత రైతులు

ఆందోళన బాటపట్టిన రాజధాని ప్రాంత రైతులు

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకతఏర్పడింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన రాజధాని ప్రాంత రైతులు కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిన్న రాజధాని ప్రాంతంలో దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి, న్యాయ పోరాటం చేయడానికి రాజధాని ప్రాంత రైతులు సిద్ధమవుతున్నారు.

మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలని సీఎం జగన్ కు రైతుల డిమాండ్

మూడు రాజధానుల ఆలోచన విరమించుకోవాలని సీఎం జగన్ కు రైతుల డిమాండ్

మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలనిడిమాండ్ చేస్తూ గురువారం రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో రాజధానికి చెందిన 29 గ్రామాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాజధాని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శిలాఫలకం వేసిన చోట ఆందోళన చేపట్టిన రైతులు ముఖ్యమంత్రులు మారితే రాజధాని మారతాయా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని వారంటున్నారు.

అమరావతి బంద్... సెక్రటేరియట్ ముందు నిరాహార దీక్షలు

అమరావతి బంద్... సెక్రటేరియట్ ముందు నిరాహార దీక్షలు


జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధానిపై ఏదో ఒక రగడ సృష్టిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు , గురువారం నుంచి వెలగపూడిలోనిసెక్రటేరియట్ ముందునిరాహర దీక్షలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు నేడు అమరావతి బంద్ కు పిలుపునిచ్చిన రైతులు శుక్రవారం నుంచి 29 గ్రామాల్లోని సచివాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన మూడు రాజధానిలో ప్రకటన వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+