మాజీ మంత్రి నియోజకవర్గంలో పావులు కదుపుతున్న మరో మాజీ మంత్రి కుమార్తె??
కాంగ్రెస్ పార్టీ హయాంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సోదరులకు ఉమ్మడి రాష్ట్ర విభజనతో రాజకీయ ప్రాధాన్యం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2014కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన రామనారాయణరెడ్డి తన సోదరుడు వివేకా మృతిచెందడంతో 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత తన సీనియారిటీని గౌరవించడంలేదని, సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతోపాటు నిరాదరణకు గురవుతున్నాని భావిస్తున్న ఆయన కొంతకాలం నుంచి బహిరంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించడంతోపాటు ఉమ్మడి నెల్లూరును విభజించిన తీరు, వెంకటగిరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఉన్న శ్రీబాలాజీ జిల్లాల్లో కలపడాన్ని ఆనం నిరసించారు. వ్యతిరేకించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వంపై బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన ఎన్నికల సమయానికి పార్టీ మారతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మహానాడులో లోకేష్ ను కలిసిన ఆనం కుమార్తె
ఇప్పటివరకు దీనిపై ఆనం ఏమీ మాట్లాడనప్పటికీ ఆయన వ్యవహారశైలి మొత్తం సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో రాజకీయ విశ్లేషకులు పార్టీ మారే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒంగోలు కేంద్రంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆనం కుమార్తె కైవల్యారెడ్డి నారా లోకేష్ ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి సీటు కోసం కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత కె.విజయమ్మ కోడలే కైవల్యారెడ్డి.
Recommended Video


ఆత్మకూరులో గట్టి పట్టు
ఇదే విషయమై ఆనంను వివరణ కోరగా బద్వేలులో తన కుమార్తె కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, ఆ ప్రభావం ఆమెపై ఉంటుందని, ఈ విషయంలో తన జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గతంలో రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవులు కూడా చేపట్టారు. అక్కడ గట్టి పట్టుండటంతో రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీచేస్తే విజయం ఖాయమనే అంచనాలోనే కైవల్యారెడ్డి లోకేష్ ను కలిసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications