ఆ విషయంలో పాక్ ను పట్టుకుని చితకబాదండి: ప్రపంచదేశాలకు భారత్ పిలుపు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో జరుగుతున్న ఆందోళనల వెనుక భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్ ఆందోళనలను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. దశాబ్దాలుగా PoK లో పాకిస్థాన్ కొనసాగిస్తున్న ఆర్థిక విధ్వంసం, ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కడం తదితర కారణాలతోనే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి తప్పులు చేసిన పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా నిలదీయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఈ తప్పిదాలకు పాకిస్థాన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే సింధూ నదీ జలాల వివాదంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా తీవ్రంగా మండిపడింది. పాకిస్థాన్ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్ పై యుద్ధానికి దిగుతామని ఖవాజా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలను చేస్తోందని మండిపడ్డారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకే భారత్ పై పాకిస్థాన్ ఇలాంటి వ్యాఖ్యలను సంధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
" పీఓకే విషయంలో భారత్ పై పాకిస్థాన్ చేస్తున్న ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పీఓకే లో కొనసాగుతున్న ఆందోళనలకు పాకిస్థాన్ సొంత వైఫల్యాలే కారణం. బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు, ఇంటర్నెట్ ను బంద్ చేసింది. ప్రజలపై దాడులకు పాల్పడింది. దాంతో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో ప్రపంచదేశాలు పాకిస్థాన్ చేసిన తప్పులను ఎండగడతాయని అనుకుంటున్నాం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

ఇక హార్మూజ్ జలసంధి ఓపెన్ పై మాట్లాడుతూ భారతీయ జెండాలు కలిగిన నౌకలు హార్మూజ్ ను ఎలాంటి ఆటంకం లేకుండా దాటుతాయని తాము విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారత్ జెండాలు కలిగిన 10 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని.. రెండు ఇప్పటికే వచ్చాయని అన్నారు. జూన్ 17 న ఒప్పందం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 11 భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయని పేర్కొన్నారు. ఒక్కో నౌక దాదాపు 2,85,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను తీసుకొస్తోందని స్పష్టం చేశారు. మిగతా నౌకలు కూడా ఇదే తరహాలో హార్మూజ్ జలసంధిని క్రాస్ చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications