అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తిగతంగా హాజరుకండి: ధోనికి అనంతపురం కోర్టు సమన్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: టీమిండియా వన్డే, ట్వంటీ20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అనంతపురం కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 7న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించి మ్యాగజైన్‌లో ధోనీ వేషధారణ హిందువుల మనోభావాలు ద్బెతీసేలా ఉందంటూ వీహెచ్‌పీ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై విష్థువు రూపంలో తన ఫొటోను ప్రచురించిన వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2013లో జరిగిన ఆ ఘటనపై ఆయన అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Anantapur court summons to team india captain

ఈ కేసుకు సంబంధించి మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించింది. బెంగుళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. బెంగుళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుని కోరిన విషయం తెలిసిందే.

ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించింది. హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

English summary
Anantapur court summons to team india captain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X