ద్రాక్షారామంలో దారుణం.. పంచారామ క్షేత్రంలో శివలింగం ధ్వంసం!
ద్రాక్షారామం ఉలిక్కిపడింది. శతాబ్దాల నాటి శివలింగం దుండగుల దాడిలో ధ్వంసంమైంది. ప్రశాంతతకు నెలవైన పుణ్యక్షేత్రంలో అలజడి రేపింది ఓ ఘటన. దీంతో దేవుడికే భద్రత లేదనే భావన ప్రజల్లోకి బలంగా ముద్రపడింది. పంచారామాలలో ఒకటైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలోని శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ దుండగులెవరు? ఇంటతి మహా పాతకానికి ఎందుకు ఒడిగట్టారు?
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రశాంతతకు మారు పేరు. అందులోనూ ద్రాక్షారామ భీమేశ్వరాలయం కోలువైన ప్రాంతం. ఆధ్యాత్మికంగా చూసినా పంచారామాలలో ఒకటి. చాలా శక్తివంతమైన ఆలయంగా హిందువులు భావిస్తుంటారు. సంక్రాంతికి కోనసీమ జిల్లాను చాలా మంది ద్రాక్షారామ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. ఇప్పుడు ఆ శివలింగం ధ్వంసమైందని వార్త అందరిని షాక్ కు గురిచేసింది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శివలింగంపై సుత్తివంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని అపశకునంగా భావించిన ఆలయ పండితులు స్థల పురాణం ప్రకారం ఆలస్యం చేయకుండా వెంటనే ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు.

రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్,
శివలింగం ధ్వంసమైందన్న సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన ఆలయానికి వచ్చారు. దుండగులు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, 6 బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టు పక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తున్నారు.
సీఎం ఆరా..
ద్రాక్షారామలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడం సీఎం చంద్రబాబును షాక్ కు గురిచేసింది. పంచారామాలయంలో శివలింగం ధ్వంసంపై సీఎం తీవ్రంగా స్పందించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.. బాధ్యులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని మంత్రి ఆనంకు ముఖ్యమంత్రి సూచించారు.
స్థల పురాణం
పంచారామ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధమైనది ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి శివుడి నుండి వరాలు పొంది, దేవతలను, ఋషులను భయభ్రాంతులకు గురి చేశాడు. దేవతల ప్రార్థనలతో శివుడు తన కుమారుడైన కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. తారకాసురుడు మరణించే సమయంలో అతని శరీరం నుండి ఒక శక్తివంతమైన శివలింగం ఉద్భవించింది. అది ఐదు భాగాలుగా విడిపోయి ఐదు ప్రాంతాల్లో పడింది. అవే పంచారామ క్షేత్రాలు. అందులో ఒకటి ద్రాక్షారామం. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరుడిగా, అమ్మవారు మాణిక్యాంబ దేవిగా కొలువై ఉన్నారు. పరమశివుడికి అంకితం చేయబడిన ప్రాంతంగా ఈ ఆలయాన్ని అభివర్ణిస్తుంటారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకీలక నిందితుడ్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల యువకుడు ఈ పాపానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. పూజలు చేస్తున్న ఆర్చకుడు మరియు అనుమానిత యువకుడు మధ్య జరిగే తరచు వివాదాలు ధ్వంసానికి ప్రధాన కారణమని నిందితుడు పోలీసులకు వివరించాడని సమాచారం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications