మంత్రులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం: నేడు ఏపీ కేబినెట్ ముందుకు వచ్చే అంశాలపై
అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ భేటీ షెడ్యూల్ అయింది. పలు కీలక అంశాలు, తీర్మానాలు, చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనా మంత్రివర్గంలో చర్చకు రానుంది.
మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలు, ఇతర తీర్మానాలను అందజేయాలంటూ ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. రెండు రోజుల ముందే ఆయా ప్రతిపాదనలన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.

పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరు వంటి అంశాలను మంత్రివర్గం చర్చించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవలే నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందన, దీన్ని మరింత విస్తృతం చేయడం, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంపైనా మంత్రివర్గం చర్చించనుంది. దీనికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు రానుంది. రాజకీయంగా అట్టడుగు వర్గాలవారికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను.. మూడు ప్రాంతాల్లో చేపట్టిన ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు చేరువ చేయగలిగినట్లు భావిస్తోంది వైసీపీ.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తీసుకుని రావడానికి అనుసరించే వ్యూహాలపైనా మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఆయా విషయాలపై వైఎస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications