ఎన్నికల వేళ.. కీలక ప్రకటన విడుదల చేసిన జగన్

YS Jagan: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పారిశ్రామిక పురోభివృద్ధి గురించి వివరించింది.

55 నెలల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 311 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీని ద్వారా 1.3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయి. మరో రెండు లక్షలమందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కాయి. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చున్న 386 ఒప్పందాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు వాటిని నెలకొల్పారు.

Andhra government has set up over 311 major industries past 55 months

ఆయా ఒప్పందాలన్నీ కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని, దీనివల్ల ఆరు లక్షలమందికి అదనంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్‌లోనే 3.94 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. విభజన అనంతరం ఏర్పడిన ఏపీలో 55 నెలల కాలంలో ఈ స్థాయిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.

జగన్ ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ వల్లే ఇది సాధ్యమైందని అధికారులు వివరించారు. 2,087 కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజీని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 16,000 కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్‌వే పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని, అవన్నీ అందుబాటులోకి వస్తే..తీర ప్రాంతం మొత్తం పారిశ్రామికీకరణ జరుగుతుంది.

కొత్త పోర్టుల వల్ల ప్రత్యక్షంగా 75,000 మందికి, పరోక్షంగా మరో లక్షమందికి ఉపాధి లభిస్తుంది. 3,793 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీలో మరో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాన్ని జరుపుకొంటోన్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకూ ఒకటి చొప్పున వాటిని నెలకొల్పాలనేది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం.

విజయనగరం జిల్లాలో 4,592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌లా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రామ్‌కో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్.. వంటి పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకుంటోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+