CM Chandrababu :హెరిటేజ్ కల్తీ నెయ్యి పై సీరియస్
కల్తీ నెయ్యి సరఫరా అంశాన్ని ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ సంస్థతో ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో అనేక సంఘటనలు ప్రజలను బాధించాయని, అసెంబ్లీలో గతంలో పాలకుల ప్రవర్తన తనను వ్యక్తిగతంగా కలచివేసిందని సీఎం అన్నారు. తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని, తనలాంటి అనేక మంది ప్రజలు కూడా ఆ కాలంలో తీవ్ర వేదన అనుభవించారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న ఘటనను గుర్తుచేసి, గతంలో ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నవారే ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తూ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

తప్పులను బయటపెట్టకుండా ఉంటే ..
శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ వ్యవహారం అత్యంత సున్నితమైన అంశమని పేర్కొంటూ, కొందరు కావాలనే దేవాలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తారని గుర్తుచేశారు. జరిగిన తప్పులను బయటపెట్టకుండా ఉంటే అపవిత్రత కొనసాగుతుందని హెచ్చరించారు.
అవాస్తవ కథనాలు..
టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా అంశాన్ని ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ సంస్థతో ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హెరిటేజ్ కుటుంబ ఆధారిత వ్యాపారమని, దాని బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారని విమర్శించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనలో అనేక నాటకాలు ఆడారని సీఎం అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను తప్పించుకునేందుకు ఇతరులపై మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సాక్షిపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారని మండిపడ్డారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల భాగంగా ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడానికి చర్యలు తీసుకునేవారని, అదే ధోరణి ఇప్పుడు కూడా కనిపిస్తోందని అన్నారు.
మద్యం వ్యవహారంలోనూ గత పాలనలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఆరోపించారు. రూ.3,200 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఆ అంశంపై కోర్టులు కూడా సీరియస్‌గా తీసుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం హోలోగ్రామ్, బ్యాచ్ నంబర్ వంటి భద్రతా ఫీచర్లతో నకిలీకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ, దేవాలయాల పవిత్రత కాపాడటం, అవినీతి ఆరోపణలపై చర్యలు - ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications