Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లడ్డూ వ్యవహారంలో అసలు జరిగిందిదీ - ఆధారాలతో సహా, జగన్ సంచలనం..!!

లడ్డూ వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతోంది. కూటమి- వైసీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని.. ఆ నెయ్యి తో లడ్డూ ప్రసాదం తయారీ చేసారనే ఆరోపణలు సుప్రీంకు చేరాయి. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటు అయిన సిట్ తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సమయంలో జగన్ లక్ష్యంగా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. జగన్ తాజాగా పార్టీ నేతలతో అసలు లడ్డూ వ్యవహారం లో ఏం జరిగిందో వివరించారు. కీలక అంశాలను ప్రస్తావించారు.

పార్టీ నేతల సమావేశంలో జగన్ లడ్డూ వ్యవహారం పైన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడు ఏం జరిగిందో వివరించారు. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్‌ వస్తే, మే 13న, పోలింగ్‌ జరిగిందని గుర్తు చేసారు. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారని జగన్ చెప్పుకొచ్చారు. జూన్‌ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారిందని పేర్కొన్నారు.

YS Jagan explains the Ghee Adulteration Transactions amid SIT Charge sheet and TDP allegations

చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైందని వివరించారు. జూన్‌ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్‌ డెయిరీ సరఫరా చేయగా... అవన్నీ ల్యాబ్‌ పరీక్షల్లో పాస్‌ అయ్యాయని చెప్పారు.ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ వడంతో వెనక్కి పంపారని వివరించారు. జూలై 23న ల్యాబ్‌ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారని చెప్పారు.

అయితే, ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్‌ చేశారని చెూప్పుకొచ్చారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారని జగన్ పేర్కొన్నారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా రాసిందని జగన్ వెల్లడించారు. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయని జగన్ వివరించారు. నిజానికి 2014-19 మధ్య ప్రీమియర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందని.. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసిందని చెప్పుకొచ్చారు.

కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని చెప్పిన జగన్.. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదన్నారు. టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉందన్నారు. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్‌ ల్యాబ్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలని చెప్పారు. అలా వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుందని... ఆ రిపోర్టు కూడా పాజిటివ్‌గా ఉంటేనే, లోపలికి పంపిస్తారని వివరించారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపామని వివరించారు.

అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014-19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారని వెల్లడించారు. సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014-19 మధ్య కూడా సప్లై చేశాయని జగన్ వివరించారు. ప్రీమియర్‌ డెయిరీ 2016, 2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసిందన్నారు. కానీ, కేవలం నాటి వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+