టీలో ఫీజులపై ఎపి న్యాయపోరాటం, బాబు డీఎస్సీ వరం
హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన న్యాయ పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో చదువుకునే అర్హులైన ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ఫీజులను తిరిగి చెల్లించే విషయమై న్యాయపోరాటం చేయాలని ఎపి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో చివరి తొమ్మిది నెలల్లో జరిగిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులపై సమీక్ష చేయాలను అనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శనివాలం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయాలకు అనుబంధ విద్యాసంస్థలు, ఆసుపత్రులను నిర్మించనున్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి మంత్రివర్గం భేటీ కావాలని నిర్ణయించుకుంది. అలాగే, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా సుమారు 15వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌కు పచ్చజెండా ఊపింది. విద్యుత్తు కొరతను మూడునెలల్లోగా అధిగమించడంపై దృష్టి సారించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన లేక్‌వ్యూ అతిధి గృహంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలోనే పలు తీర్మానాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్తు కొరతను అధిగమించి వచ్చే మూడు నెలల్లోగా విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఏపీట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల ఉన్నతాధికారులను సమావేశానికి పిలిపించి పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.
న్యాయ సమ్మతంగా ఉన్న పీపీఏలను అలాగే ఉంచి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని తీర్మానించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న 65 మెగావాట్ల విద్యుత్తు వ్యత్యాసాన్ని భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే తమిళనాడు నుంచి 300 మెగావాట్లు తీసుకుని ప్రస్తుత రాష్ట్ర అవసరాలను తీర్చాలని తీర్మానించారు.
త్వరలో కృష్ణపట్నం నుంచి సమకూరనున్న 800 మెగావాట్లు, సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే హిందుజా నుంచి మరో వెయ్యివాట్లతో భవిష్యత్తులో విద్యుత్తు కొరతను అధిగమించాలని నిర్ణయించారు. అలాగే, రాష్ట్ర అవసరాలకు సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సోలార్, పవన విద్యుత్తు యూనిట్లను ప్రోత్సహించాలని తీర్మానించారు. థర్మల్ విద్యుదుత్పత్తికి అవసరమైన 4 లక్షల టన్నుల బొగ్గును వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి తెప్పించుకోవాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వివిధ శాఖల మంత్రుల నుంచి పొందిన హామీలను నెరవేర్చుకునే వరకు సంబంధిత రాష్ట్ర మంత్రులు వారితో సమన్వయంతో పని చేయాలని, ఐఐటి, ఎయిమ్స్, పెట్రో, గిరిజన,వ్యవసాయ వర్శిటీలను సాధ్యమైనంత త్వరగా సాధించుకుని 13 జిల్లాలకు ప్రాధాన్యమిస్తూ ప్రాంతాల వారీగా వాటిని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై ఈ ఏడాది ఏప్రిల్ వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం వ్యయంలో 90 శాతం తిరిగి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలని, అందులో భాగంగానే ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలను కర్నూలులో నిర్వహించాలని తీర్మానం చేయాలని, గ్యాస్ ప్రమాదాల నిరోధానికి ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
ఐటీ, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు ఏక గవాక్ష పద్ధతిని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేక హోదా, ఇక్కడ లభించే ప్రోత్సాహకాల గురించి వివరించి పెట్టుబడిదారులను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని రకాల ద్రువపత్రాలను పొందేందుకు ఐటీని వినియోగించుకోవాలని, రైతు పట్టాదారు పాసు పుస్తకం నుంచి విద్యార్థులకు అవసరమైన ద్రువపత్రాల వరకు అన్ని జారీ చేయాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి వద్ద ఈసారి మహా కుంభమేళాను నిర్వహించనున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications