వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం...ఆగస్టు 1 నుంచి అమలు:ఉత్తర్వులు జారీ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఇప్పటివరకూ పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మథ్యాహ్న భోజన పథకం ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందుబాటులోకి రానుంది. ఆగస్టు 1 నుంచి వారికి ఈ మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌దాస్‌ బుధవారం ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. 331 జూనియర్‌ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆహార సరఫరా చేస్తారు.

Andhra Pradesh:Mid day meals for intermediate students...implementation from August 1

ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంటశాలలకు, ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది.

English summary
Amaravati: Until now, The mid-day meal scheme available for Only school children in the State...but now onwards this is also available for intermediate students. This mid day meal scheme for intermediate students will be implemented from August 1. Aditya Nathdas, Special Secretary General of State Government, on Wednesday issued the orders over this scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X