తిరుమల లడ్డూ వివాదం, జగన్ చిన్నానకు నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్, సిద్దమా ?
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమల శ్రీవారి లడ్డూల వివాదం రానురాను ముదిరిపోతావుంది. రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా మీరు పని చేశారని, ఆ సమయంలో తిరుమల లడ్డూల నాణ్యతపై మీరు సరైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ వైసీపీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.
టీటీడీ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకొని దోచుకున్నారని, చివరికి శ్రీవారి లడ్డూల నాణ్యత పై తప్పుడు నిర్ణయాలు తీసుకుని కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డిపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చెయ్యడానికి జంతువుల కొవ్వు కలిపారని తెలుసుకొని తాను నిజంగా షాక్ అయ్యానని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుమల లడ్డూల తయారీ జంతువుల కొవ్వుతో తయారు చేసి కల్తీ నెయ్యి వాడరని వెలుగు చూసిందని లోకేష్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం పెద్దలు, ఆ పార్టీ నాయకులు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రాజకీయాలు చేశారని, కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.
టీటీడీని ప్రక్షాళన చేయడానికి మా ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుమల పవిత్రను కాపాడేందుకు, కోట్లాదిమంది శ్రీవారి భక్తులు మనోభావాలు కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుమలలో లడ్డూల వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
చిత్తూరు జిల్లాకి క్యాన్సర్ గడ్డలా తయారైన పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాము వదిలి పెట్టమని, టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బంగారుపాళ్యంలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వంలో తప్పు మీద తప్పులు చేసిన ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకుల కోసం భజన చేసిన అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకనైనా వైసీపీ నాయకుల భజన చెయ్యడం మానుకుని ప్రజలకు సేవ చేయాలని కొందరు ప్రభుత్వ అధికారులకు మంత్రి నారా లోకేష్ సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications