హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణ సంస్థలపై ఐటీ దాడులు: మంత్రి నారాయణ ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

నారాయణ విద్యాసంస్థల పై ఐటీ దాడులు?

విజయవాడ: గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు.

నారాయణ సంస్థలపై ఐటీ దాడులు?

నారాయణ సంస్థలపై ఐటీ దాడులు?

కాగా, వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. వారంతా శుక్రవారం వేకువజాము నుంచే రాష్ట్రంలోని కొంతమంది ఇళ్లు, పలు కన్‌స్ట్రక్చన్ కంపెనీలపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది.

వదంతులే వాస్తవం కాదు..

వదంతులే వాస్తవం కాదు..

అయితే, నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.

రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?

విజయవాడలో ఏడు ఐటీ బృందాల సోదాలు

విజయవాడలో ఏడు ఐటీ బృందాల సోదాలు

ఇది ఇలావుంటే, విజయవాడ నగరంలో మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన సదరన్‌ డెవలపర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ కార్యాలయంతో పాటు సంస్థ ప్రతినిధుల నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు. గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీఎస్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. రాజకీయ నేతలపై ఈ సోదాలు జరుగుతాయంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగినా ఐటీ అధికారులు వాటిని ఖండించారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉన్న ప్రీకాస్టింగ్‌, ఇటుకల తయారీ కంపెనీపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 7 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ సోదాలు జరుగుతాయంటూ ప్రచారం జరగడంతో పాటు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగవచ్చంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఐటీ శాఖ మాత్రం ఈ వదంతులు అవాస్తవమని తేల్చిచెప్పింది.

టీడీపీ నేతలపై ఐటీ దాడులు

టీడీపీ నేతలపై ఐటీ దాడులు

ఇటీవల తెలంగాణలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం నెల్లూరులో టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. రాత్రి 7 గంటల వరకూ అధికారులు రికార్డుల పరిశీలన చేస్తూనే ఉన్నారు. చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇక్కడ ఆదాయం పన్ను అధికారులను వివరాలను అడగాలని ప్రయత్నించినా వారు లోపలికి ఎవరిని అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తరువాతనే మీడియాతో మాట్లాడతామని సిబ్బంది చేత సమాచారం ఇచ్చారు. ఐటీ శాఖ దాడులపై ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలను సేకరించారు.

English summary
Andhra Pradesh Minister P Narayana responded on Income Tax raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X