నారా లోకేష్ చుట్టూ వ్యూహం పన్నుతున్న జగన్?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యూహం పన్నుతున్నారు. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఐదువేల ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని సర్వేలు చెప్పినప్పటికీ పట్టుదలగా పోటీచేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన మద్దతుతో సీపీఐ తరఫున పోటీచేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావుకు 10వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతున్న లోకేష్
మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి కూడా పోటీచేస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యూహం మార్చారు. ఎందుకంటే 2024లో ఇక్కడి నుంచే పోటీచేస్తున్నట్లు ఎప్పుడో చెప్పారు. లోకేష్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని కలియతిరుగుతున్నారు. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటున్నారు. గతంలో లోకేష్‌ను కలవాలంటే ముఖ్యమంత్రి కుమారుడంటూ.. ఎక్కువ భద్రతంటూ చాలా కష్టమయ్యేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా గ్రామగ్రామాన క్యాడర్‌ను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

బీసీ వ్యూహంతో లోకేష్ కట్టడి?
దుగ్గిరాల ఎంపీపీ పదవికోసం ఆయన అద్భుత వ్యూహం పన్నారని సీనియర్ రాజకీయవేత్తలు కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబునాయుడిని, మంగళగిరి నుంచి లోకేష్‌ను ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీ వ్యూహం పన్నారు. అందులో భాగంగానే రాజ్యసభకు ఇద్దరు బీసీలు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావును ఎంపిక చేశారు.

ఈసారి హోరాహోరీ పోరు
రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ కావడంతో వారిని దరిచేర్చుకుంటే మళ్లీ అధికారం సులువుగా కైవసం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాకుండా బీసీ అభ్యర్థిని అందులోనే చేనేత రంగానికి చెందిన వ్యక్తిని లోకేష్‌కు ప్రత్యర్థిగా నిలబెట్టబోతున్నారు. ఆ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికే నిర్ణయించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications