దాని వల్లే ఓడిపోయాం..వైసీపీ ఓటమిపై అనిల్ కుమార్ యాదవ్ రియలైజ్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలను నమోదు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా పార్టీ ఓటమిపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వైసీపీకి ఓటమి కొత్త కాదని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాము పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామనే విషయాన్ని గుర్తు చేశారు. ఎందువల్ల ఓడిపోయామో తెలుసుకుని లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. కేవలం నోటిదురుసు వల్లే ఇవాళ తాము ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.. ఒకవేళ అదే నిజమైతే సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి హామీలు అమలకు కొంత సమయం ఇస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications