తిరుమల తరహాలో అన్నప్రసాదం
Chandrababu: ఒంటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
సాయంత్రం 6:30 గంటలకు ఎదుర్కోలుతో కల్యాణోత్సవం ఆరంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం, మధుపర్కార్చనం నిర్వహించారు అర్చకులు.

మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది.
స్వామివారి కల్యాణోత్సవం ముగిసిన తరువాత సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికి శ్రీవారి సేవకులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. శ్రీరామరాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టంగా పేర్కొన్నారు.
ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో శ్రీరాముడు నేర్పించాడని చంద్రబాబు చెప్పారు. తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని అన్నారు. తిరుమలలో గోవింద నామం ప్రతిధ్వనిస్తున్న విధంగా ఒంటిమిట్టలో జై శ్రీరామ్ నినాదమే వినిపించాలని, దీనికి అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
తిరుమల తరహాలో ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అక్కడే ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావుకు ఆదేశించారు.
ఒంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్‌లో కీలక మార్పులు, ఇక సులభంగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications