ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్ వెల్లడి...
ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది.
Recommended Video
వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండబోతోందని ఆయన ఇవాళ గుంటూరులో తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘుపతి ఈ విషయం పేర్కొన్నారు.

ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టత కారణంగా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని కోన రఘుపతి తెలిపారు. దీంతో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే అంశంపైనా క్లారిటీ వచ్చినట్లయింది. జిల్లాల సరిహద్దులతో పాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో రఘుపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications