తిరుమలకు రక్షణ కవచంలా నిలిచిన శ్రీవారి ఆడపడుచుల గురించి తెలుసా?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 67,284 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,064 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్టుమెంట్ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

కాగా- తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అవ్వాచారి కోన సమీపంలో గల అక్కదేవతల గుడిలో ఈ నెల 13వ తేది ఉదయం కార్తీకమాస పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ అధికారులు. అక్కడ కొలువుదీరిన ఏడుమంది అక్కగార్లకు ప్రతి సంవత్సరం కార్తీకమాసోత్సవ పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ రవాణా విభాగం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వైభవంగా ఈ పూజలను జరుపనున్నారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న ఓ చిన్న గుడి ఇది. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా ఇక్కడ పూజలు అందుకుంటోన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆడపడుచులుగా భక్తులు కొలుస్తారు. అక్కగార్లు తిరుమలకు రక్షణ కవచంగా కొలువు దీరి ఉన్నారు.
అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో అక్కగార్ల శిలలు ఉండేవి. ఆ శిలలను తొలగించి రోడ్డు వేశారు అప్పట్లో. ఫలితంగా- రోడ్డు నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయని, ప్రమాదాలు జరుగుతుండేవని, దీనితో ఉన్నతాధికారులు సప్తమాతృకలను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించారని చెబుతారు. 2008 నుండి అక్కగార్ల గుడిలో ప్రతి సంవత్సరంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తోన్నారు టీటీడీ అధికారులు.












Click it and Unblock the Notifications