కృష్ణా నదిలో మరో బోటు బోల్తా: నీళ్లలోకి దూకడంతో తప్పిన పెను ప్రమాదం
కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా పడింది. ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం మరవకముందే ఇది చోటు చేసుకుంది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
విజయవాడ: కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా పడింది. ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం మరవకముందే ఇది చోటు చేసుకుంది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా నదిలో ఈ పడక మునిగింది. ఇసుక తెచ్చేందుకు నదిలోకి వెళ్లిన పడవ తిరిగొస్తున్న సమయంలో నీటి మునిగింది.

ప్రమాదాన్ని ముందే గుర్తించిన అందులోని వారు నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పడవలో పరిమితికి మించి ఇసుక రవాణా చేయడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలోని ఈ పడవ బోల్తా పడింది.












Click it and Unblock the Notifications