టీడీపీని ఇరకాటంలోకి నెట్టిన మరో ఎమ్మెల్యే..?
టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవ్వరో కాదు..ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహనలేమి తనంతో ఆయన చేస్తోన్న పనులు పార్టీతో పాటు, ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తోందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గెలిచిన నెలలోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిపైకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లి నానాయాగి చేశారాయన.
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేశారు. దాంతో కొలిపూడి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టారు. అయిన తీరు మార్చుకుని ఎమ్మెల్యే రోడ్లు సరిగా లేవని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తాజాగా కొలిపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా ఐదు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే కొలిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications