రిషికేశ్వరి తర్వాత... నాగార్జునలో మళ్లీ ర్యాగింగ్, వెంటనే స్పందించిన వీసీ ఉదయలక్ష్మి
గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ర్యాగింగ్ అంశం మరవకముందే... మరోసారి ర్యాగింగ్ అంశం వెలుగు చూసింది. వర్సిటీలో తమను వేధిస్తున్నారని ఓ విద్యార్థిని పోలీస్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది.
విద్యార్థిని ఫిర్యాదు మేరకు బాధ్యుడి పైన చర్యలు తీసుకున్నట్లు వైస్ ఛాన్సులర్ ఉదయ లక్ష్మి గురువారం చెప్పారు. వేధింపులకు పాల్పడిన విద్యార్థిని రెండు వారాలు సస్పెండ్ చేశామని, కౌన్సెలింగ్ ఇచ్చామని ఆమె చెప్పారు.

సీనియర్లు తనను ర్యాగింగ్ చేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన విద్యార్థిని డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు.
కాగా, రిషికేశ్వరి ఘటన అనంతరం ప్రిన్సిపల్ పైన వేటు పడింది. నాగార్జున ఇంఛార్జి విసిగా ఉదయలక్ష్మి కొద్ది రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. తాజా ఘటన పైన ఆమె వేగంగా స్పందించారు. ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకొని, చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications