తెలంగాణ రాదేమోననే బెంగతో యువకుడి ఆత్మహత్య

వివరాలు ఇలా ఉన్నాయి - గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న కుమార్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. రాష్ట్ర విభజనపై రోజుకోరకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభిస్తుందో లేదోనని తోటి స్నేహితుల వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తుండేవాడు.
ఈ క్రమంలో ఇంటికి సమీపంలోనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను తెలంగాణ కోసమే చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశాడు.
'తెలంగాణ ఏర్పాటును ఆంధ్రోళ్లు అడ్డుకుంటున్నారు. ఇక నాకు ఉద్యోగం రాదు. నేనుండీ లాభం లేదు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే నా ఆత్మకు శాంతి కలుగుతుంది.' అని నోట్‌లో అన్నాడు.












Click it and Unblock the Notifications