వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందరు టెక్కీ హత్య: చిత్రహింసలు పెట్టి చంపారు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని మచిలిపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. వ్యభిచార నిర్వాహకులు అనూహ్యను చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అనూహ్య హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచార నిర్వాహకులు ఉన్నారు. ఇందుకు సంబంధించి తెలుగు టీవీ చానెళ్లలో మంగళవారం సాయంత్రం వార్తలు వచ్చాయి.

అనూహ్యను ఈ నెల 9వ తేదీన హత్య చేసి, కెమికల్స్‌పోసి నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. ఆమె మరణానికి ముందు ఐదురోజులు నరకయాతనకు గురిచేసిన నిందితులు తర్వాత హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. అదే రోజు ఆమె సెల్‌ఫోన్ నుంచి కాల్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

 Anuhya torchered and killed

పోలీసులు అదుపులో ఉన్నవారు అసలు విషయాలను బయటపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. మంగళవారంనాడు వచ్చిన వార్తాకథనాల ప్రకారం - ముంబైలోని కామాటిపురా సమీపంలోని ఒక గదిలో ఆమెను ఐదు రోజుల పాటు నిర్బంధించారు. ఆమెను దారుణంగా కొట్టారు, హింసించారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

23 ఏళ్ల అనూహ్య ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 4.45 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ చేరుకుందని ముంబై పోలీసులు వెల్లడించారు. కొద్ది నిముషాల తర్వాత తాను నివసించే అంధేరి వెస్ట్‌కు వెళ్ళేందుకు ఒక క్యాబ్ మాట్లాడుకుంది. అయితే క్యాబ్ డ్రైవర్ అనూహ్యను దారి మళ్లించాడు. కొన్ని నిమిషాలు ప్రయాణించిన తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు క్యాబ్ ఎక్కారు.

అనూహ్య వారి దురుద్దేశ్యాన్ని పసిగట్టి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ నిందితులు ఆమె నుంచి మొబైల్ ఫోన్లు లాక్కొని వాటిని స్విచ్చాఫ్ చేశారు. ఆమెను కామాటిపురాకు సమీపంలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఐదు రోజుల పాటు ఆమెను నిర్బంధించారు.

ఎనిమిదో తేదీ రాత్రి లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని ఆమె అడ్డుకోవడంతో నిందితులు అమెను దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె మరుసటి రోజు వరకు స్పృహ కోల్పోయింది. అనంతరం వారు కంజూర్ మార్గ్‌లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అనూహ్యను హత్య చేశారు. ఆమెపై రసాయనాలు పోసి నిప్పు పెట్టారని అంటున్నారు.

English summary
Lady software engineer from Machilipatnam in Andhra Pradesh has been torchered and killed in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X