వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొహం చెల్లకే బాయ్‌కాట్‌-రఘురామతో కుట్రలు-ఏది రాజద్రోహం ? టీడీపీపై శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వరుస ఓటములతో మొహం చెల్లకే టీడీపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం బహిష్కరిస్తోందని ప్రభుత్వ ఛీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడే ధైర్యం చంద్రబాబుకూ, టీడీపీకీ ఎప్పటికీ లేదన్నారు. ఎంతసేపటికీ దేవాలయాలు, చర్చిలు, రఘురామకృష్ణంరాజు లాంటి కుట్రరాజకీయాలనే టీడీపీ నమ్ముకుందని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి ఉపఎన్నికలో కరోనా వ్యాప్తి చేసి చంద్రబాబు, లోకేష్‌ పక్క రాష్ట్రానికి పారిపోయారని విమర్శించారు. అగ్గి రాజేయడానికో, కుట్రలు చేయడానికో వీరిద్దరూ రాష్ట్రానికి వస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

 ఓటములతో మొహం చాటేస్తున్న టీడీపీ

ఓటములతో మొహం చాటేస్తున్న టీడీపీ

పంచాయతీల నుంచి తిరుపతి ఉపఎన్నిక వరకూ అన్ని ఎన్నికల్లో వరుస పరాజయాలతో మొహం చెల్లకే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తోందని ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబుకూ, టీడీపీకి ప్రజలు బుద్ది చెప్పినా ఇప్పటికీ ప్రజలను నమ్మకుండా కుట్ర రాజకీయాలను పట్టుకుని వేలాడుతున్నారని ఆరోపించారు అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న కుట్రల బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే మొహం చాటేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
ఓటమి భయంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించి, ఆ తర్వాత తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేశారని, టీడీపీకి ఒక విధానం అంటూ లేదు అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, హాజరయ్యే ఎమ్మెల్యేలకు కోవిడ్ టెస్టులు చేసి, నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నామని, సోషల్ డిస్టెన్స్ లో సీటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. అయినా టీడీపీ ఎందుకు భయపడుతుందో ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు.
- రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని, మరోవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రభుత్వ చర్యలను కూడా ప్రశంసిస్తుంటే, మాట్లాడటానికి మొహం చెల్లకే టీడీపీ బహిష్కరణ బాట పట్టిందని అన్నారు.

సంక్షేమంపై మాట్లాడే దమ్ముందా ?

సంక్షేమంపై మాట్లాడే దమ్ముందా ?

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడే ధైర్యం టీడీపీ, చంద్రబాబుకూ లేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఎంతసేపటికీ దేవాలయాలు, చర్చిలు, రఘురామకృష్ణంరాజు.. ఇలా ఏదో ఒక సమస్యను సృష్టించి దాన్ని తన రాజకీయ స్వార్ధం కోసం వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తే.. గత రెండేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల నుంచి రఘురామకృష్ణరాజు అంశం వరకు మీరు చేస్తున్న కుట్రలకు సంబంధించి మీ బండారం ఎక్కడ బయటపడుతుందనే భయంతోనే రావడం లేదు అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
టీడీపీ ఏరోజూ ప్రజలకు అండగా నిలబడలేదు అని, పైగా రాష్ట్రంలో ఏదో జరుగుతుందన్నట్టు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.

వ్యవస్ధల్ని మేనేజ్‌ చేసినా ప్రజల మనసు మార్చలేరు

వ్యవస్ధల్ని మేనేజ్‌ చేసినా ప్రజల మనసు మార్చలేరు


వ్యవస్థలను అయితే మేనేజ్ చేస్తున్నారుగానీ.. ప్రజల మనసు మార్చలేమన్నదే వారి భయమని ప్రభుత్వ ఛీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని వ్యాక్సినేషన్, ఆక్సిజన్ గురించి చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చుని జూమ్ మీటింగ్ లు పెడుతూ పదే పదే మాట్లాడి, బురదజల్లాలని చూస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి, ప్రభుత్వంపై ఎంత బురద పూయాలని చూస్తున్నా, జగన్ మోహన్ రెడ్డిగారిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న అచెంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రజల మనసుల్లో ఆయన స్థానాన్ని చెరిపివేయలేమన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరిస్తుందన్నారు.

 కళ్లార్పకుండా బాబు చెప్పే అబద్దాల్ని చూసి

కళ్లార్పకుండా బాబు చెప్పే అబద్దాల్ని చూసి

కళ్ళార్పకుండా బాబు చెప్పే అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
- చంద్రబాబు నాయుడు ఏనాడూ ఒంటరిగా పోరాటం చేయలేడని, ఒకవైపు సుపుత్రుడు, మరోవైపు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, అంతకుముందు చెప్పుల పార్టీ.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకర్ని నమ్ముకుని బొక్క బోర్లా పడ్డరని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా రఘురామకృష్ణరాజును పట్టుకొచ్చారన్నారు. కళ్ళు తెరిచి, రెప్పార్పకుండా చంద్రబాబు రోజూ చెబుతున్న అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చేసేవన్నీ తప్పులు, అక్రమాలు, పైకి మాత్రం సిగ్గుపడకుండా నీతులు వల్లె వేస్తూ, పదే పదే అబద్ధాలు, అసత్యాలు చెబుతున్న చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా ఎప్పుడో వెలి వేశారని అన్నారు. పక్క రాష్ట్రంలో రూ. 300 కోట్లతో నిర్మించుకున్న సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన భవనంలో కూర్చుని చంద్రబాబు రోజూ అబద్ధాలు, అసత్యాలు వల్లె వేస్తున్నారని ధ్వజమెత్తారు.

 ఏది రాజద్రోహం ?

ఏది రాజద్రోహం ?


రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు వేసిన కుట్రలో భాగంగా, ఆయన డైరెక్షన్ లోనే రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. కోర్టులకు వెళ్ళి, ఒకసారి గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారని, మరోసారి పోలీసులే కొట్టారని ఏదేదో మాట్లాడుతున్నాడని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకోవైపు మీసాలు మెలివేసి, కారులో కూర్చుని కాళ్ళు పైకెత్తి రఘురామకృష్ణరాజు చూపిస్తున్నాడు, ఆయన వాడుతున్న భాష, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి గారిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత బరితెగింపుగా ఉన్నాయో ప్రజలంతా చూశారని తెలిపారు. రాజద్రోహం కేసు అన్నది తాను వినలేదని, చూడలేదని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. గతంలో ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై 12 కేసులు పెట్టారు. మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, నా పైన ఆసుపత్రి ప్రారంభించినందుకు.. ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు అని గుర్తు చేశారు.

English summary
ap assembly chief whip srikanth reddy on today slams tdp for boycotting upcoming one day budget tomorrow. he also criticises rebel mp raghurama raju for his dramas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X