అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ నేతలు "ఫిక్స్" - సమాచార చోరీ : సభా సంఘం నిర్దారణ: విచారణకు ముఖ్యులు పిలుపు..!!

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో మరో సారి రాజకీయంగా కలకలానికి అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైన పెగాసెస్.. వ్యక్తిగత డేటా చోరీ పైన నియమించిన సభా సంఘం కీలక నిర్దారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిదంటూ అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార టీడీపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అందులో ప్రయివేటు వ్యక్తుల ప్రమేయం ఉందంటూ ఫిర్యాదులు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెగాసెస్ కొనుగోలు పైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

పెగాసెస్ ప్రకంపనలు

పెగాసెస్ ప్రకంపనలు

నాడు తమ వద్దకు పెగాసెస్ కొనుగోలు కు ప్రతిపాదన వస్తే తిరస్కరించామని..కానీ, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు దానిని కొనుగోలు చేసారంటూ వ్యాఖ్యానించారు. దీంతె.. గత అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సమయంలో ఇదే అంశం పైన సభలో చర్చ జరిగింది. దీని పైన పూర్తి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీని పైన సభా సంఘం నియమించింది. దీని పైన చర్చించిన సభా సంఘం గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత సమాచా చౌర్యం జరిగిందనే నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సంఘం మూడు సమావేశాలు నిర్వహించింది. తాజాగా జరిగిన సమావేశంలో హోం - ఐటీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను ప్రయివేటు వ్యక్తులకు అందించి.. కొందరి ఓట్ల తొలిగింపుకు ప్రయత్నించదనేది ఆరోణ.

టీడీపీ హయాంలో వినియోగించారంటూ

టీడీపీ హయాంలో వినియోగించారంటూ

ఇదే సమయంలో ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం .. ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వటం ముప్పుగా సభా సంఘం నిర్దారించింది. ఇదే అంశం పైన విచారణలో వెల్లడైన అంశాలను హోం శాఖ అధికారులు సభా సంఘం ముందుంచారు. అయితే, ఈ వ్యవహారంలో నాటి మంత్రులు ..కీలక అధికారుల ప్రమేయం లేకుండా డేటా చౌర్యం సాధ్యం కాదనే అభిప్రాయం సభా సంఘంలోని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వారితో పాటుగా ప్రయివేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏంటి.. ఎలాంటి పాత్ర వారు నిర్వహించారనే అంశం పైన వారిని విచారణకు పిలవాల్సిన అవసరం ఉందా లేదా అనే కోణంలోనూ చర్చించారు. వారిని విచారించాల్సిన అవసరం పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కీలక నిర్ణయం దిశగా సభా సంఘం

కీలక నిర్ణయం దిశగా సభా సంఘం

ఈ రోజున సభా సంఘం మరోసారి సమావేశం కానుంది. ఇందులో ఎవరిని విచారణకు పిలవాలనే అంశం పైన తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే టీడీపీ నేతలతో పాటుగా.. చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వేంకటేశ్వర రావు సైతం అసలు పెగాసెస్ అనేది కొనుగోలు చేయలేదని..తేల్చి చెప్పారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం అదే విషయాన్ని నిర్దారిస్తూ వచ్చిన సమాధానాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు సభా సంఘం తీససుకోయే నిర్ణయం ఈ సమయంలో రాజకీయంగా కీలకం కానుంది.

English summary
AP House committee may take crucial decision on pegasus and Date theft issue in TDP. Committee ready to reccomend the decisions to the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X