Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Assembly Results 2024: అధికారం డిసైడ్ చేసేసిన భీమవరం; పశ్చిమగోదావరిలో కూటమి హవా!!

AP assembly election Results: ఏపీలో ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టిడిపి, బిజెపి, జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఏపీ ఎన్నికల కౌంటింగ్ లో భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు దూకుడును కొనసాగిస్తున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పై వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై 7 రౌండ్ పూర్తయ్య సరికి 31600 మెజారిటీ సాధించారు. భీమవరంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీలో ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో భీమవరంలో తాజా ట్రెండ్ కూటమికే అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

AP Assembly Results 2024 Bhimavaram decided ap ruling party tdp alliance leading in West Godavari

మరోవైపు ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు ముందంజలో ఉండగా, నరసాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ముందంజలో ఉన్నారు. తణుకు అభ్యర్థి టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ ముందంజలో ఉన్నారు. పాలకొల్లు టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందంజలో ఉన్నారు.

తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే గతానికి భిన్నంగా ఈసారి జనసేన పార్టీ 21 స్థానాలలో దూకుడును కొనసాగిస్తుంది. ఇది జనసేన శ్రేణుల్లో సంతోషానికి కారణంగా మారింది. మరోవైపు ఏపీలో కూటమి విజయం పక్కా కావటంతో కూటమి శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంతో పాటు తెనాలి, తాడేపల్లిగూడెం, పి.గన్నవరం, తిరుపతి, నరసాపురం, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, భీమవరం, రాజానగరం, ఉంగుటూరు, నిడదవోలు, అవనిగడ్డ, రైల్వే కోడూరు, కాకినాడ రూరల్, రాజోలు,నెల్లిమర్ల, వైజాగ్ సౌత్, పాలకొండ నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఆధిక్యాన్ని కనపరుస్తుంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+