తాత్కాలిక భవనమెందుకు, వృథా ఖర్చు: స్పీకర్‌తో చంద్రబాబు, హైదరాబాద్‌లోనే శీతకాల సెషన్స్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక భవన నిర్మాణ ప్రతిపాదనకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. తాత్కాలిక భవన నిర్మాణం వృథా ఖర్చని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తాత్కాలిక భవన నిర్మాణంపై చంద్రబాబుతో ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అసెంబ్లీ తాత్కాలిక భవన నిర్మాణానికి విముఖత చూపారు. ఈ మేరకు స్పీకర్‌తో చంద్రబాబు తాత్కాలిక భవన నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు. అయితే హాయ్‌లాండ్‌లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

సభ్యులకు వసతి కల్పించవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోనే ఆంధ్రప్రదేశ్ శీతకాల సమావేశాలు జరుగుతాయని చంద్రబాబునాయుడు చెప్పారు.

AP assembly sessions will be held in Hyderabad

రవాణా, ఆరోగ్యశాఖల అధికారులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌రాష్ట్రంలో తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. రవాణాశాఖ అధికారులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

దీన్ని నివారించేందుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పూర్తిస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై గంటకు 80కిలోమీటర్‌ వేగం దాటకుండా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా, పురపాలక, మండల స్థాయి ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి శుక్రవారం పరిశుభ్రత దినంగా పాటించాలని అధికారులకు సూచించారు.
వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+