వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి అసెంబ్లీలో విచిత్రాలు:మిత్రపక్షమే ప్రతిపక్షం!...అక్కడ కూడా...

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపిలో సోమవారం నుండి జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరో విచిత్రం చోటు చేసుకోనుండటం ఖాయంగా కనిపిస్తోంది. గత సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం వైసిపి బాయ్ కాట్ చేయడంతో అధికారపక్షమే ప్రతిపక్షం పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అయితే ఈసారి సమావేశాల్లోనూ జనం మరో విచిత్రాన్ని చూసే అవకాశం ఉంది. అదేమిటంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్య పార్టీలుగా, మిత్ర పక్షాలుగా ఉన్నటిడిపి-బిజెపి...ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం, ప్రతిపక్షంగా వ్యవహరించడం అనివార్యంగా కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో బిజెపిని నిలదీయాలని టిడిపి నిర్ణయించిన నేపథ్యంలో, ఎపి అసెంబ్లీలో టిడిపిని నిలదీయాలని బిజెపి నిర్ణయించడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకోనుంది.

సోమవారం నుంచి...అసెంబ్లీ సమావేశాలు...పార్లమెంట్ సమావేశాలు కూడా...

సోమవారం నుంచి...అసెంబ్లీ సమావేశాలు...పార్లమెంట్ సమావేశాలు కూడా...

మార్చి 5, సోమవారం నుంచి ఎపిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి మార్చి నెలాఖరు జరిగే అవకాశం ఉందని సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటనను బట్టి అర్ధం అవుతోంది. మరోవైపు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో ఎపికి ప్రత్యేక హోదా విషయమై వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుండగా మిత్ర పక్షం టిడిపి సైతం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాము దశలవారీగా పోరాటం చేస్తామని టిడిపి ఎంపిలు పేర్కొంటుండటం గమనార్హం.

వైసిపికి...స్పీకర్ ఆహ్వానం...

వైసిపికి...స్పీకర్ ఆహ్వానం...

అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసిపిని ఆహ్వానిస్తున్నామని, ఈసారి సమావేశాలకైనా ఆ పార్టీ సభ్యులు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నామని అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌రావు చెప్పారు. ఈ సమావేశాలకు రావాలంటూ ఇప్పటికే కొంత మంది వైసిపి నేతలతో మాట్లాడామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు, వాటి పరిష్కారానికి అసెంబ్లీనే ఉన్నతమైన వేదిక అని, ఈ సదవకాశాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకోవాలని కోడెల సూచించారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడే అంశాలకు, ప్రస్తావించే విషయాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎపి ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం ఉదయం 9 గంటలకు గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారని స్పీకర్‌ వెల్లడించారు.

గత సమావేశాల్లో అలా...ఈసారి సమావేశాల్లో ఇలానా?...

గత సమావేశాల్లో అలా...ఈసారి సమావేశాల్లో ఇలానా?...

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా...అధికార పక్షం ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం వైసిపి అనూహ్యంగా ప్రకటించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినా ప్రతిపక్షం వైసిపి మాత్రం ఆ సమావేశాలకు హాజరుకాకూడదనే స్ట్రాంగ్ గా ఫిక్సయిపోవడంతో ప్రతిపక్షమే లేని సమావేశాలుగా రికార్డులకు ఎక్కాయి. అయితే ప్రతిపక్షం లేని పరిస్థితుల్లో ఆ సమావేశాల సందర్భంగా టిడిపి
విచిత్ర నిర్ణయం తీసుకుంది. అధికార పక్షమే ప్రతిపక్షం పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకొంది, అలా నిర్ణయించుకోవడమే కాదు అక్షరాలా అదే పని చేసి భారత రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఎపి అసెంబ్లీ సమావేశాల్లోనూ మరో విచిత్రం చోటుచేసుకోనుండటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో రాష్ట్రంలో మిత్ర పక్షం, భాగస్వామ్య పార్టీగా ఉన్న బిజెపి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపికి ప్రతిపక్షంగా వ్యవహరించనుంది...ఇది మరో విచిత్రం

ఎందుకలా?...అనివార్యమేనా?...

ఎందుకలా?...అనివార్యమేనా?...

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బాయ్ కాట్ చేయడంతో సభా నిర్వహణా సౌలభ్యం కోసం అధికార పక్షం టిడిపినే తమ సభ్యులని ప్రతిపక్షంగా వ్యవహరించేలా చేసింది. అధికార పక్షం,ప్రతిపక్షం రెండు పాత్రల్ని వారే పోషించారు. అయితే ఈ సమావేశాల సమయం వచ్చేసరికి ఎపి రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరో విచిత్రానికి దారితీసాయి. గతంలో ఎన్ని బేధాభిప్రాయాలు కలిగినా సర్థుకుంటూ వచ్చిన మిత్ర పక్షాలు టిడిపి-బిజెపి మధ్య కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ చిచ్చు పెట్టింది. తదనంతరం ఈ రెండు పార్టీలు ఆరోపణలు,ప్రత్యారోపణలతో పరిణామాలు అనూహ్యంగా మారిపోగా, మిత్రపక్షాలే శత్రుపక్షాలుగా మారి తలపడేటట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అటు పార్లమెంట్లో బిజెపిని నిలదీయాలని టిడిపి నిర్ణయిండగా, అదే జరిగితే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో టిడిపిని నిగ్గదీసి అడగాలని బిజెపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అటు పార్లమెంట్, ఇటు ఎపి అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి ప్రారంభం కానుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఎపి అసెంబ్లీ సమావేశాల్లో టిడిపిని మిత్రపక్షం బిజెపినే ప్రతిపక్షంగా మారి ఇబ్బంది పెట్టే అవకాశాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి.

ప్రధానంగా ఈ అంశాలు...ఏం జరుగుతుందో...సర్వత్రా ఉత్కంఠ...

ప్రధానంగా ఈ అంశాలు...ఏం జరుగుతుందో...సర్వత్రా ఉత్కంఠ...

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్, ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, విభజన చట్టం అమలు, రాష్ట్ర ప్రయోజనాలు ఈ అంశాలే ప్రధాన అజెండాగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహం పెట్టుకోనక్కరలేదు. ఈ అంశాలపై చర్చ సందర్భంగా కేంద్రంపై, బిజెపిపై టిడిపి విమర్శలతో దండెత్తాలని చూస్తే తాము అందుకు ధీటుగా ప్రతిస్పందించాలని బిజెపి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు, మంత్రులు గనుక కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేస్తే తాము కూడా టిడిపి పాలన, చంద్రబాబు వైఖరి, వైఫల్యాలను ఎండగట్టాలని బిజెపి భావిస్తోంది. అలాగే గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు ఇతర టిడిపి నేతలు కేంద్రాన్ని ఎలా పొగిడారో, ప్రధానమంత్రి నరేంద్రమోడి, అరుణ్ జైట్లీలను ప్రశంసిస్తూ మంత్రివర్గంలో చేసిన తీర్మానాలు వాటన్నింటిని ఆధారాలు, రుజువుతో ప్రస్తావిస్తూ టిడిపిని ఇరుకునపెట్టే అవకాశ కనిపిస్తోంది...ఇలా నిన్నటి, నేటి మిత్రపక్షమే రేపటి ప్రతిపక్షంగా మారిపోతోంది.

English summary
AP Assembly sessions will begin from Monday. A strange thing will place during these meetings. It is strange that the BJP, which is an ally of the TDP in the state,centre...is acting as an opposition in these sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X