కొడాలి నాని లాంటి వాళ్ళను జైలుకు పంపుతాం: సునీల్ దియోధర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళితే, జగన్ వరుస పర్యటనలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మరో పక్క బిజెపి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ నియోజకవర్గాల వారీగా బీజేపీ చార్జ్ షీట్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది బిజెపి.ఈ క్రమంలో తాజాగా గుడివాడ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి ఛార్జిషీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మంత్రి కొడాలి నాని పై విరుచుకుపడ్డారు. కొడాలి నాని నియోజకవర్బిగాన్జెని అభివృద్పిధి చేసింది లేదన్నారు. ఆయన హయాంలో గుడివాడ నాశనం అయ్యిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వాళ్లను జైలుకు పంపిస్తామన్నారు. కొడాలి నాని మాటలతో రాష్ట్రం పరువు పోతుందని ఆయన మండిపడ్డారు.
గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యారని కొడాలి నాని ని తిట్టి పోశారు. తెలుగువారికి ఎంతో విశిష్టత కలిగినటువంటి సంక్రాంతి పండుగ సంస్కృతిని కొడాలి నాని నాశనం చేశారని, సంక్రాంతిని క్యాసినో, క్యాబరే డ్యాన్సులు గా మార్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
గుడివాడ ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని, ఆయన చేష్టలతో గుడివాడ యువత సర్వనాశనం అవుతున్నారని సునీల్ దియోధర్ మండిపడ్డారు. కొడాలి నానిని జీవితాంతం అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications