రఘురామకు పురందేశ్వరి షాక్ - నర్సాపురం నుంచి శ్యామలాదేవి..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుల లెక్కల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం పైన చర్చలు జరుగుతున్నాయి. ఎంపీ స్థానాల సర్దుబాటు పైనే చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ సొంతగా పోటీ పైన సిద్దం అవుతోంది. అందులో భాగంగా నర్సాపురం స్థానం నుంచి పురందేశ్వరి చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అటు టీడీపీతో పొత్తు చర్చలు చేస్తూనే..బీజేపీ సొంతంగా పోటీకి సిద్దం అవుతోంది. సీట్లు, పొత్తు పైన ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. పరోక్షంగా టీడీపీ పైన ఒత్తిడి పెంచుతోంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో చర్చల సమయంలోనూ ప్రధానంగా ఎంపీ స్థానాల పైనే చర్చించారు. బీజేపీ 8 స్థానాలు ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబు 6 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే రెండో విడత చర్చల్లో ఒక నిర్ణయానికి రానున్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరటం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీకి కేటాయించే సీట్లలో నర్సాపురం పార్లమెంట్ స్థానం ఉంది. బీజేపీ నుంచి తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ రాజు పేరు ఇప్పటి వరకు రేసులో ఉంది.

తాజాగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ ప్రతిపాదించిన పేర్లలో నర్సాపురం నుంచి మరో పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిపాదించారు. దివంగత నటుడు కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పేరును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు చేసినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. పొత్తు కుదిరితే రఘురామ బీజేపీ నుంచి పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. పొత్తు లేకపోతే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే శ్యామలా దేవికి ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. పొత్తు లేకపోతే రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మరో ఆసక్తి కర అంశం. దీంతో, ఈ రోజు ఢిల్లీలో జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ చర్చల్లో పొత్తు పైన తుది నిర్ణయం ఆధారంగా అభ్యర్దుల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications