గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నినాదాలు - ప్రసంగం ఆరంభంలోనే : సీఎం జగన్ ఆగ్రహం..!!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలోనే గందరగోళం ఏర్పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ప్రసంగం ప్రారంభించారు. ఆ వెంటనే టీడీపీ సభ్యులు నిదానాలు మొదలు పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థలన కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. గవర్నర్ తన ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలోనే టీడీపీఎల్పీ డిప్యూటీ లీడర్ తన స్థానంలోనే నిలబడి గవర్నర్ ప్రసంగం పత్రాలు చింపేసారు. కొందరు టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చే ప్రయత్నం చేసారు. వారిని చూస్తూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రసంగం ప్రతులను చింపి..విసురుతూ
గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే టీడీపీ సభ్యులు తమ నినాదాలను మరింత తీవ్రతరం చేసారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ చేస్తున్న నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి.. గవర్నర్ ప్రసంగిస్తున్న పోడియం వద్దకు వచ్చిన టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి గాల్లోకి విసిరేసారు. ఆయన ప్రసంగం వినపడకుండా సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ప్రభుత్వానికి వత్తాసు పలికే గవర్నర్ గో బ్యాక్ అంటూ నినదించారు. అమరావతి కి వ్యతిరేక నిర్ణయం పైన సంతకం పెట్టిన గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదలు చేసారు.

పోడియం వద్దకు సభ్యుల నినాదాలు
ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. అయినా..టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కు తగ్గలేదు. నినాదాల జోరు పెంచారు. ముందు వరసలో నిలిచిన అచ్చెన్నాయుడు సైతం నిరసన వ్యక్తం చేసారు. పోడియం వద్ద టీడీపీ సభ్యుల నిరసనతో సభ్యులకు గవర్నర్ స్పీచ్ వినపడక ఇబ్బంది పడ్డారు. అయితే, పలు రకాల స్లోగన్లు ఇస్తూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పైన ఈ మూడేళ్ల కాలంలో టీడీపీ వ్యతిరేక నినాదాలు చేయటం.. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసనకు దిగటం ఇదే తొలి సారి.
Recommended Video

టీడీపీ సభ్యుల వాక్ అవుట్...
గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన సమయం నుంచి నినాదాలతో హోరెత్తించిన టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసారు. గవర్నర్ గో బ్యాక్ అంటు ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేసారు. చాలా సేపు నినాదాలతో హోరెత్తించారు. పోడియం వద్దకు వెళ్లి ప్రసంగం ప్రతులను చింపి విసిరేసారు. ఆ తరువాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనూ టీడీపీ సభ్యులంతా సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. గవర్నర్ తిరిగి వెళ్లే మార్గంలోకి టీడీపీ సభ్యులు రాకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీలు బీ టెక్ రవిని మార్షల్స్ బలవంతంగా తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications