ఏపీ కేబినెట్ సంచలనం-వైసీపీకి చంద్రబాబు బిగ్ షాక్ ?
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా పోస్టుల చర్చే. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను సైతం విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. వీటిపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని కీలకంగా చర్చించింది. మంత్రులతో సోషల్ మీడియా పోస్టుల అరాచకంపై చర్చించిన సీఎం చంద్రబాబు అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాళ కేబినెట్లో ప్రధాన అజెండా పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇందులో ఆయన
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలపై చర్చించారు. అనంతరం తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్ర చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం మంత్రుల నుంచి సూచనలు ఆహ్వానించారు.

అనంతరం సీఎం చంద్రబాబు తప్పుడు సోషల్ పోస్టులపై చర్యలకు చేసే చట్టంలో సిఫార్సుల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మంత్రులు వంగపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఈ ఉపసంఘం పని చేయనుంది. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే అధికార కూటమికీ, విపక్షంలో వైసీపీకీ మధ్య సోషల్ వార్ తీవ్రంగా సాగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం తప్పుబడుతూ వైసీపీ సోషల్ వార్ సాగిస్తోంది. తాజాగా యూరియా అంశంలో కొరత ఉందంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. వీటిపై ఆగ్రహంగా ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేబినెట్ లోనే వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు.












Click it and Unblock the Notifications