స్థానిక ఎన్నికలపై సంచలన నిర్ణయం, కీలక మార్పులు - బీసీ రిజర్వేషన్లు ఇలా..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల వేళ భేటీ అయిన కేబినెట్ లో స్థానిక సంస్థల పైన నిర్ణయానికి వచ్చారు. స్థానిక ఎన్నికల ముహూర్తం దాదాపు ఖరారైంది. అదే విధంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు విధి విధానాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాగా, ఇక మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలకు ప్రత్యక్ష విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినెట్ స్థానిక ఎన్నికల పైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేసింది. తొలుత మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34 రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. అదే విధంగా అర్బన్ ప్రాంతంలో బీసీలకు 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్థికసంఘం నిధులు రూ.16,500కోట్లు మురిగిపోకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

 పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
పురందేశ్వరికి కీలక పదవి వెనుక - మోదీ మార్క్ లెక్కలు..!!
ap-cabinet-green-signal-for-implementation-of-bc-reservations-in-local-body-elections-here-the-det

అక్టోబర్ లో ఎన్నికలకు సమాయత్తం

అదే విధంగా మేయర్ల ఎన్నికకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక.. పాత పద్దతిలో ఒక డిప్యూటీ మేయర్‍కే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి డిప్యూటీ మేయర్.. డిప్యూటీ ఛైర్మన్ ఒక్కరే ఉండే విధంగా నిర్ణయించారు. అసెంబ్లీలోనే బీసీ రిజర్వేషన్ల పైన బిల్లు లేదా తీర్మానం చేయనున్నారు. న్యాయపరమైన అవాంతరాలు ఎదురైతే పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అమరావతి రైల్వేలైన్‍కు ల్యాండ్ పూలింగ్‍పై నిర్ణయం తీసుకున్న కేబినెట్..అదే సమయంలో హ్యామ్ మోడల్లో రూ.7,469.46 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధికి నిర్ణయించారు. జాబ్ క్యాలెండర్.. ఉద్యోగాల కల్పనా పైన చర్చించారు. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+