వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి నగరాన్ని...ఆనంద నగరంగా మార్చేందుకే డీప్ డైవ్ 2017: ఎపి సిఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అమరావతి నగరాన్ని హ్యాపి సిటీ గా రూపొందించడానికి అవలంభించాల్సిన పధ్దతుల గురించి చర్చించేందుకు అమరావతి డీప్ డైవ్ నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతికి ప్రపంచస్థాయి రాజధానికి ఉండాల్సిన హంగులు సమకూర్చేందుకు ఈ డీప్ డైవ్ వర్క్ షాప్ తోడ్పడుతుందని సిఎం చంద్రబాబు చెప్పారు.

అమరావతి..ది వరల్డ్ క్లాస్ సిటీ...

అమరావతి..ది వరల్డ్ క్లాస్ సిటీ...

అమరావతి వరల్డ్ క్లాస్ హ్యాపీ సిటీగా రూపుదిద్దుకునేందుకు అవసరమైన నిపుణుల చేయూత, ఆ మహోన్నత లక్ష్యం సాకారమయ్యేందుకు కావాల్సిన విభిన్నభాగస్వాముల తోడ్పాటు ఒకే మీదకు రప్పించేందుకు ఈ డీప్ డైవ్ 2017 వర్క్ షాప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఊహల్లో ఉన్న అత్యున్నతమైన ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చేందుకు అవసరమైన ప్రణాళిక సిద్దం చేసేందుకు ఈ వర్క్ షాప్ ఎంతగానో తోడ్పడుతుందని సిఎం చంద్రబాబు ప్రశంసించారు.

నిపుణుల,మేథావుల సమ్మేళనం...

నిపుణుల,మేథావుల సమ్మేళనం...

అమరావతిని ప్రపంచస్థాయి హ్యాపీ సిటీగా నిర్మించేందుకు విభిన్న రంగాలకు, వివిధ దేశాలకు చెందిన మేథావులు,నిపుణులు కలసి పనిచేసేలా ఎపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో డీప్ డైవ్ వర్క్ షాప్ దిక్సూచి పాత్ర పోషిస్తోంది. డీప్ డైవ్ వర్క్ షాప్ లో భాగస్వాములైన జాతీయ, అంతర్జాతీయ మేధావుల జాబితా ఆ విషయాన్ని రుజువుచేస్తోందని ఎపి సిఎం అంటున్నారు.

సిఆర్ డిఎ కృషి..

సిఆర్ డిఎ కృషి..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపుదిద్దుకున్న తీరు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చేవిధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుకూలంగా ఆయన కోరుకున్న రాజధాని కల సాకారమయ్యేందుకు అవసరమైన వేదికలను సిఆర్ డిఎ సిద్దం చేస్తోంది. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా నిర్వహించిన డీప్ డైవ్ వర్క్ షాప్ కూడా సిఆర్ డిఎ ఆధ్వర్యంలోనే నిర్వహించబడింది.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ డీప్ డైవ్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 3 ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో ఒకటి అమరావతి జీఐఎస్ వెబ్ సైట్ కాగా, మరొకటి భూమి రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టం. వీటితోపాటు 3డీ మోడల్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థకు సంబంధించిన మరో ప్రాజెక్టును సిఎం చంద్రబాబు ప్రారంభించారు.

English summary
vijayawada: Amaravati, the People's capital of Andhra Pradesh, is envisioned to be a city of world-class standards with a vision of increasing Andhra Pradesh’s prominence in the world. The AMARAVATI DEEP DIVE WORKSHOP 2017 initiative is, but a natural step in the direction of participation by diverse stakeholders in building a true people’s Capital at Amaravati. As part of Deep Dive, Chief Minister Chandrababu started three important projects. One is Amravati GIS website and another is the Black Chain Asset Management System for Land Records Security. In addition, CM Chandrababu started another project related to the 3D model building system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X