వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై బాధ్యత, మిగిలితే టికే: బాబు, హ్యాపీఅని కెసిఆర్‌కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత తన పైన ఉందని, సామాజిక తెలంగాణ స్థాపన అయ్యే వరకు తాను ఇక్కడ ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు సచివాలయానికి వచ్చారు. ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

సామాజిక తెలంగాణ తీసుకు వచ్చే వరకు తాను తెలంగాణలో ఉంటానని చెప్పారు. తెలంగాణ ప్రజలు మన అన్నదమ్ములే అన్నారు. తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తానని చెప్పారు. సింగరేణిని మూసివేస్తామన్న నిర్ణయాన్ని తానే అడ్డుకున్నానని, అది లాభాల బాట పట్టేలా చూశానని చెప్పారు.

Ap CM Chandrababu challenges Telangana CM KCR

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో, పాలనలో తనతో పోటీ పడితే సంతోషిస్తానని చెప్పారు. సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటే దానిని తాము తెలంగాణకే ఇస్తామని చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యను తీర్చమని కోరానే తప్ప... తెలంగాణ రాష్ట్రానికి సమస్యను సృష్టించాలని చెప్పలేదన్నారు. టిడిపి పాలన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు.

పోలవరం వల్ల ఇతర రాష్ట్రాలకు కూడా లాభం ఉంటుందని చెప్పారు. ఉన్నపళంగా హైదరాబాదును ఖాళీ చేయమంటే ఎలా అన్నారు. ఎపిలో కనీస సౌకర్యాలు లేవన్నారు. హైదరాబాదులాంటి నగరం నిర్మాణానికి కనీసం ఇరవై, ముప్పై ఏళ్లు పడుతుందని చెప్పారు. సీమాంధ్రుల ఆస్తులు ఎక్కడున్నా వారి పరిరక్షణ బాధ్యత తనది అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నష్టమని తాను చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందన్నారు. ఎవరికీ అన్యాయం జరగదన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేద్దామన్నారు. స్వర్ణాంధ్ర కోసం అందరం కలిసి నిరంతరంగా పని చేద్దామన్నారు. ఉద్యోగులు అడక్కుండానే తాను విరమణ వయస్సు పెంచానని చెప్పారు. కొత్త రాజధానికి వీలైనంత త్వరగా వెళ్లాలనే ఉత్సాహంలో ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.

English summary
AP CM Chandrababu Naidu challenged Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X