ఏపీలో వారికి న్యూ ఇయర్ కానుక ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఆ డబ్బులు ఖాతాలలో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ వారికి సంక్షేమాన్ని అందిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
వారికి స్కాలర్ షిప్ లను విడుదల చేసిన సర్కార్
రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన విద్యార్థులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేసింది. ఇక ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని, గిరిజన విద్యార్థులకు బాసటగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

గత ప్రభుత్వ హయాం లో బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం 100.93 కోట్ల రూపాయలను, 59, 927 మంది అర్హులైన పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఖాతాలకు క్రెడిట్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి
ఈ చర్య గిరిజన విద్యార్థులలో ఆనందాన్ని నింపి వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందిస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల విద్యను ఇది మరింత మెరుగుపరుస్తుందని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయన్న మంత్రి సంధ్యా రాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కితాబిచ్చారు. ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేస్తూ విద్యార్థులకు తోడ్పాటును అందిస్తుంది అన్నారు. ఇది ఒక ముందడుగు మాత్రమేనని, నూతన సంవత్సరంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గిరిజన సంక్షేమాన్ని అందిస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.












Click it and Unblock the Notifications