'జల్ మంథన్'లో బాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌

న్యూఢిల్లీ: నదుల అనుసంధానంపై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'జల్ మంథన్' సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే నదుల అనుసంధానం అవసరమని అన్నారు. కొన్ని దేశాలు సముద్రపు నీటని తాగునీటిగా మారుస్తున్నాయని అన్నారు.

సముద్రంలో కలుస్తున్న నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే ఏపీలో నీటి నష్టాలు తీరుతాయన్నారు. ఈ సారి ఏపీలో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. జలవనరులు చాలా ముఖ్యమైనవి, మైక్రో, లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.

AP CM Chandrababu Naidu to participate in 'Jal Manthan'

అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానానికి ముందు... రాష్ర్టాల్లోని నదులను అనుసంధానం చేయాలని బాబు సూచించారు. కేంద్రం సహకారంతో ఐదేళ్లలో ఏపీలో మోడల్‌ ప్రాజెక్టును రూపొందించి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నాతాధికారులు, నీటిపారుదల రంగ నిపుణుపు పాల్గొన్నారు. సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్వవస్ధీకరణ చట్టం అమలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను రాజ్ నాధ్ సింగ్‌కు వివరించినట్లు తెలుస్తొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+