YS Jagan: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍తో సీఎం జగన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. జగన్ నిర్మలా సీతారామన్ తో దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన జగన్.. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు ఆర్థిక మంత్రికి వివరించారు.

AP CM Jagan met Union Finance Minister Nirmala Sitharaman

2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో చర్చించారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, రూ.6,756.92కోట్ల బకాయిల అంశాన్ని నిర్మలా వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని జగన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని వివరించారు.స్కూళ్లలో నాడు - నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని తెలిపారు. ఆరోతరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు.

AP CM Jagan met Union Finance Minister Nirmala Sitharaman

అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని జగన్ మంత్రికి వివరించారు. విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు నాడు -నేడు కింద పనులు చేపట్టామని.. దీనికోసం రూ.౪వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వీటికోసం చేసిన ఖర్చును డబ్బును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు జగన్ కోరారు. శనివారం నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం జగన్ పాల్గొనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+