వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ : అమిత్ షా తో భేటీ : రఘురామ ఎపిసోడ్..తాజా లేఖలు..వ్యాక్సిన్ల వ్యవహారం..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. సీఎం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం.

 ఢిల్లీకి సీఎం జగన్

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం వైయస్ జనగ్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం జగన్..అమిత్ షా తో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల పైన చర్చించనున్నారు. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసారు. కానీ, ఇతర రాష్ట్రాల కంటే తక్కవ మొత్తంలో వ్యాక్సిన్లు ఏపీకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు.

 అమిత్ షా ముందుకు రఘురామ ఎపిసోడ్

అమిత్ షా ముందుకు రఘురామ ఎపిసోడ్


వ్యాక్సిన్ల విషయంలో ముఖ్యమంత్రులంతా ఒకే వాయిస్ తో ఉండాలని సీఎం కోరారు. దీని పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ అంశం పైన అమిత్ షా భేటీలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇక, ఏపీ ప్రభుత్వం పైన తన సొంత పార్టీకి చెందిన ఎంపీ రెబల్ గా మారి చేస్తున్న ప్రచారం పైనా సీఎం కేంద్ర హోం మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం. రఘురామ రాజు పైన తాము ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అనర్హత వేటు వేయక పోవటం పైన జగన్ అండ్ టీం గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీలో ఉంటూ కేంద్ర మంత్రులు..ఎంపీలు..పలు సంస్థలకు రఘురామ రాజు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన లేఖల మీద కొందరు ఎంపీలు సైతం ప్రభుత్వాన్ని తప్పు బడుతూ వ్యాఖ్యలు చేసారు.

Recommended Video

Anantapur : అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించిన Ys Jagan || Oneindia Telugu
పోలవరంతో పాటు పలు అంశాలపై చర్చ

పోలవరంతో పాటు పలు అంశాలపై చర్చ

రఘురామ రాజుకు బీజేపీలో కొందరు ముఖ్యుల మద్దతు ఉందనే వాదన ఉంది. దీంతో..రఘురామ రాజు పైన చర్యలు తీసుకోవాల్సిందేనని వైసీపీ నేతలు పట్టు బడుతున్నారు. ఏపీలో కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్లు కేటాయంచేల చొరవ తీసుకోవాలన ముఖ్యమంత్రి మరో సారి అమిత్ షా ను కోరనున్నట్లు సమాచారం. ఇక, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల పైన వరుసగా కొర్రీలు పెడుతున్నారు. ఆ నిధుల విషయంలోనూ జోక్యం చేసుకొని...రాష్ట్ర విభజన అంశాల పైన నోడల్ శాఖగా ఉన్న హోం శాఖ తగిన సూచనలు చేయాలని సీఎం కోరనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

English summary
CM Jagan delhi tour on monday to meet with central home minister Amith Shah. Cm May discuss on vaccination and also Raghu Rama Raju episode with Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X