ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ-పోలవరంపై వినతులు- కాసేపట్లో కేంద్రమంత్రులతో చర్చలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రారంభమైంది. ఉదయం ప్రధాని మోడీని ఆయన నివాసంలో సీఎం జగన్ కలుసుకున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో దీనిపై ప్రధానితో చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులతో పాటు పునరావాస ప్యాకేజీ అంశంపై సీఎం జగన్ చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధాని మోడీ నుంచి ఏ మేరకు హామీ లభించింది అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే ప్రధానితో జగన్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది.
ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం జగన్ పలువురు కేంద్రమంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇందులో విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో పాటు ఇతర మంత్రుల్ని కూడా అపాయింట్ మెంట్లు కోరినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర విత్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అనంతరం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలవబోతున్నారు.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో జగన్ ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో భేటీల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చర్చిస్తున్నారు. అయితే రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులు జగన్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం జగన్ తో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications