వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ జడ్ భద్రతపై గందరగోళం, తొలగించలేదని ఏపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 'జడ్' కేటగిరీ భద్రతను తొలగించలేదని ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు మంగళవారం తెలిపారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం దురుద్దేశ్య పూర్వకంగా ఈ నెల 13వ తేదీ నుండి భద్రతను తగ్గించిందని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా జడ్ కేటగిరి భద్రతను ప్రభుత్వం తగ్గించిందని చెప్పారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ భద్రతను తొలగించినట్లు ఉత్తర్వులేవని ప్రశ్నించారు.

AP denies withdrawing Jagan’s Z security cover

ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే కుదించారని, ఈ నెల 13 నుండి సిబ్బందిలో కొంతమంది విధులకు హాజరు కావడం లేదని న్యాయవాది బదులిచ్చారు. ఏజీ జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్‌కు జడ్ కేటగిరీ భద్రతను తొలగించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్ పైన విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు, ప్రకాశం జిల్లా ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి 2 ప్లస్ 2 భద్రతను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆయనకు 1 ప్లస్ 1 భద్రత ఉందని, మరోవైపు సుబ్బారెడ్డి ప్రాణహాని ఉన్న వ్యక్తుల జాబితాలో లేరని ఏజీ తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరారు. దీంతో 2 ప్లస్ 2 భద్రత పునరుద్ధరణకు నిరాకరించారు. తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా వేశారు.

English summary

 The Andhra Pradesh government denied withdrawing the Z-category security to YSR Congress chief and opposition leader YS Jaganmohan Reddy as alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X