ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. మొదటి ఐదు ర్యాంకర్ల వివరాలివే..
ఏపీ ఎంసెట్ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు.
విజయవాడ: ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ పరీక్ష ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు.
ఇంజనీరింగ్ విభాగంలో 1,23,974 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 79.74 గా ఉంది. ఇక అగ్రికల్చల్, ఫార్మసీ విభాగంలో మొత్తం 69,683 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 65,675 మంది హాజరయ్యారు. మొత్తం 55,289 మంది అర్హత సాధించారు. విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్లకు కూడా ఫలితాలను పంపించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో...
మొదటి ఐదు ర్యాంకర్ల వివరాలు వరుసగా... మోహన్ అబ్యాస్- 153.95 మార్కులు, ఎ. సాయి భరద్వాజ్, ఆర్.సత్యం, జయంత్ హర్ష, సాయి మౌనిక్.
వ్యవసాయ, ఫార్మసీ విభాగాల్లో...
మొదటి ఐదు ర్యాంకర్ల వివరాలు వరుసగా... ఉటుకూరు వెంటక సాయి అనిరుధ్(గుంటూరు), దుగ్గా సందీప్(విశాఖ), నున్న హిమజ(రాజమహేంద్ర వరం), సిద్దాని నిఖిల్ చౌదరి(హైదరాబాద్), బి.ఫణిలాస్య(నెల్లూరు).












Click it and Unblock the Notifications