AP elections: సినీఫక్కీలో మాచర్లలో దాడుల టెన్షన్; ఏపీలో పొలిటికల్ ఫ్యాక్షన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఏపీ ఎన్నికలలో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు బలంగా తల పడుతుంటే ఇప్పుడే చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, దాడులు ముందు ముందు ఏపీలో ఎలాంటి నేరాలను చూడాల్సి వస్తుందో అన్న అనుమానానికి కారణంగా మారాయి.
మూడు రోజుల క్రితం మాచర్లలో టిడిపి నేత సురేష్ కారును తగలబెట్టిన రౌడీ మూక, మళ్లీ గురువారం రాత్రి జనసేన నేతల పైన దాడికి పాల్పడ్డారు. టిడిపి జనసేన బిజెపి కూటమి తరపున మాచర్ల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు లక్ష్యంగా వైసిపి మూకలు దాడికి పాల్పడ్డారు.

మొన్న దుర్గి మండలం జంగమేశ్వర పాడులో ఎన్నికల ప్రచారం కొనసాగించి మాచర్ల నుంచి తిరిగి వెళుతున్న జనసేన వాహనం పైన జంగమేశ్వర పాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. జనసేన వాహనాన్ని వెంబడించి రాళ్లతో దాడి చేసి, జనసేన నాయకులను కొట్టి.. మళ్లీ ఎన్నికల ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరించారు.
జంగమేశ్వర పాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులపై, వాహనంపై వైసిపి నేత మన్నయ్య సహా మరో 20 మంది దాడి చేశారని, తాము ఎన్నికల ప్రచారం చేయకూడదని పిడి గుద్దులు గుద్ధారని, కంట్లో కారం కొట్టి, తమన కొట్టారని, కర్రలు, రాళ్లు, రాడ్లతో తమ వాహనాన్ని ధ్వంసం చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వైసిపి దాడిలో వారు గాయాల పాలయ్యారు.

దీనిపైన జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మించాలపాడు కు చెందిన జనసేన కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్న క్రమంలో వీరిని టార్గెట్ చేసిన వైసిపి నేతలు వారి పైన దాడులకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసులో 20 మంది నిందితులను అరెస్టు చేశారు.
మాచర్లలో కొనసాగుతున్న దాడులపై ఈసీ పోలీస్ అధికారులను వివరణ కోరుతున్నప్పటికీ మాచర్లలో దాడులను ఆపడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఏ విధంగా ఉండబోతుందో అని మాచర్ల వాసులు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications